భక్తిశ్రద్ధలతో ఈద్‌-ఉల్‌-ఫితర్‌

ABN , First Publish Date - 2022-05-04T05:51:54+05:30 IST

నెల రోజుల కఠిన ఉపవాస దీక్షలు ముగి శాయి. నెలవంక కనిపించడంతో ఈద్‌-ఉల్‌-ఫితర్‌ను ముస్లింలు మంగళ వారం ఘనంగా జరుపుకున్నారు.

భక్తిశ్రద్ధలతో ఈద్‌-ఉల్‌-ఫితర్‌
ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌

-  మహబూబ్‌నగర్‌లో ఈద్గా మైదానం కిటకిట

- శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, ఎంపీ, నాయకులు



మహబూబ్‌నగర్‌/ మహబూబ్‌నగర్‌ టౌన్‌/ మహమ్మదాబాద్‌/ దేవర కద్ర/ రాజాపూర్‌/ గండీడ్‌/ హన్వాడ/ మూసాపేట/ అడ్డాకుల/ జడ్చర్ల/ మిడ్జిల్‌/ బాలానగర్‌, మే 3 : నెల రోజుల కఠిన ఉపవాస దీక్షలు ముగి శాయి. నెలవంక కనిపించడంతో ఈద్‌-ఉల్‌-ఫితర్‌ను ముస్లింలు మంగళ వారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని మజీదులు, ఈద్గా మైదానాల వద్ద నమాజు చేశారు. ఈద్గాల వద్ద ముస్లింలకు ప్రజాప్రతినిధులు ఈద్‌ ముబారక్‌ తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని జామా మజీదు నుంచి వానగుట్టలోని ఈద్గా మైదానం వరకు ముస్లిం సోదరులు ఉదయ మే వేలాదిగా చేరుకొని మతపెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశా రు. అక్కడ వారికి రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మతాలకు అతీతంగా పలుచోట్ల హిందువులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అంటేనే సెక్యులరిజం అని, ఇక్కడ హిందూ ముస్లిం భాయ్‌భాయ్‌ అనే సంప్రదాయం ఉందని అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఉండే ప్రజలం తా సుఖశాంతులతో కలిసి మెలిసి జీవించే వాతావరణం కల్పించామన్నా రు. కార్యక్రమంలో ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు, అడిషినల్‌ కలెక్టర్‌ తేజస్‌ నంద లాల్‌ పవార్‌, అడిషనల్‌ ఎస్పీ రాములు, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇంతియాజ్‌ ఇసాక్‌, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌, ముని సిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేష్‌, నాయ కులు కోరమోని వెంకటయ్య, రాజేశ్వర్‌గౌడ్‌, అబ్దుల్‌ రహమాన్‌, అన్వర్‌ పాషా, జకి, ర హీం, మోసిన్‌ఖాన్‌, జావెద్‌బేగ్‌ పాల్గొన్నారు. 

ఫ మహమ్మదాబాద్‌ మండలంలో ముస్లింలకు జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, భిక్షపతి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షు డు నారాయణ, బీజేపీ  నాయకుడు రాజేందర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఫ దేవరకద్రలో టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సేకట్రరి కొండ ప్రశాంత్‌ రెడ్డి మసీదు దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేసి శుభాక్షాంక్షులు తెలిపారు.

ఫ రాజాపూర్‌, గండీడ్‌, బాలానగర్‌ మండలాల్లో ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక పార్థనలు చేశారు. యువకులు, నాయకులు ఒక్కరినొకరు కౌగిలిం చుకొని శుభాకాం క్షలు తెలుపుకున్నారు.

ఫ హన్వాడ, వేపూర్‌లలో ఎస్‌ఐ తిరుపాజీ ముస్లింలకు రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయా గ్రామాలలో వివిధ పార్టీల పెద్ద లు. ప్రజాప్రతినిధులు రమణారెడ్డి, పెంటయ్య, బాలయ్య, సత్యం, శ్రీను ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఫ మూసాపేట మండలంలో ఈద్గాల దగ్గరకు ముస్లింలు తరలివెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండల కో ఆప్షన్‌ సభ్యు లు జమీర్‌  ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ఆల వెంకటే శ్వర్‌రెడ్డి మూసాపేటకు చేరుకొని జమీర్‌ ఇంట్లో విందును ఆరగించారు. ఆయన వెంట జడ్పీటీసీ ఇం ద్రయ్యసాగర్‌, మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనర్సిం హ్మ యాదవ్‌, మండల యువత అధ్యక్షుడు అచ్చా యిపల్లి సర్పంచ్‌ చంద్రశేఖర్‌, నాయకులు టైలర్‌ కలీం, కొండయ్య, కాశీనాథ్‌, ముస్లింలు ఉన్నారు.

ఫ అడ్డాకులలోని జామియా మజీదు ఏ ఖుబా ఈద్గా దగ్గర ముస్లిం లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్డాకుల ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి, జడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీని వాస్‌రెడ్డి, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు రంగన్నగౌడ్‌ తదితరు లు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

ఫ జడ్చర్ల పట్టణంలో రంజాన్‌ పర్వదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్‌ బాదిమి శివకుమార్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. 

ఫ మిడ్జిల్‌ మండలంలో ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అయా గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రార్థన స్థలాల వద్దకు వెళ్లి ముస్లింలకు పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు.

శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ సీనియర్‌ నాయకుడు

రంజాన్‌ పర్వదినం పురస్కరించుకొని మంగళవారం టీడీపీ సీనియర్‌ నేత చంద్రశేఖర్‌రెడ్డి పలువురు ముస్లింకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యూగంజ్‌లోని ఈద్గా వద్ద ముస్లింలు నిర్వహించిన సామూ హిక ప్రార్థనలో టీడీపీ నాయకులు పాల్గొని రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్‌ నాయకులు

రంజాన్‌ పండగ సందర్బంగా కాంగ్రెస్‌ నాయకులు ఈద్గా మైదానం వద్ద మంగళవారం మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌, నాయకులు ఎన్‌పీ వెంకటేశ్‌, సంజీవ్‌ముదిరాజ్‌, చంద్రకుమార్‌గౌడ్‌, సీజే బెనహర్‌, లక్ష్మణ్‌ యాదవ్‌ పాల్గొన్నారు.





Read more