చోరీ కేసులో ఎనిమిది మంది అరెస్టు

ABN , First Publish Date - 2021-01-21T05:53:41+05:30 IST

శ్రీసిటీలోని తేర్‌మ్యాక్స్‌ పరిశ్రమలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి ఎనిమిది మందిని బుధవారం అరెస్టు చేశారు.

చోరీ కేసులో ఎనిమిది మంది అరెస్టు
పోలీసులు స్వాధీనం చేసుకున్న రాగివైర్లు

ఐదు వాహనాల సహా 60 కిలోల రాగి వైరు స్వాధీనం 


సత్యవేడు, జనవరి 20: శ్రీసిటీలోని తేర్‌మ్యాక్స్‌ పరిశ్రమలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి ఎనిమిది మందిని బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఓ టాటా ఏస్‌ వాహనంతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలు, 60 కిలోల రాగివైరును స్వాధీనం చేసుకున్నారు. శ్రీసిటీ డీఎస్పీ జగదీష్‌నాయక్‌ కథనం మేరకు.... తేర్‌మ్యాక్స్‌ కంపెనీలో జనవరి 4వ తేదీన చోరీ చోరీ జరిగింది. కంపెనీ యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కంపెనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్‌ పరిశీలించి నిందితులను గుర్తించారు. నట్లు ఆయన తెలిపారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి ఓ టాటా ఏస్‌ వాహనంతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలు, 60 కిలోల రాగివైరును స్వాధీనం చేసుకున్నారు. వరదయ్యపాళెం మండలం కుప్పాడ తాగలి గ్రామానికి చెందిన బెల్లపుకొండ వెంకటేష్‌(24), బెల్లంకొండ భాస్కర్‌(25), అంకయ్య(29), వరదయ్యపాళెం సిద్ధేశ్వరపురానికి చెందిన కాకి వెంకటేష్‌(31), బెల్లపుకొండ శేఖర్‌(26), కుప్పం మండలం తన్నమ్మకోటల్‌ గ్రామానికి చెందిన పెరుమాల్‌(27), కేవీబీపురం మండలం దిగువపూడి గ్రామానికి చెందిన దేవల శేఖర్‌(34), సత్యవేడు మండలం వానెల్లూరు గ్రామానికి చెందిన వేమన్వేల్‌(26)లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు డీఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి, ఏఎస్‌ఐ షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T05:53:41+05:30 IST