Expo 2020 Dubai: ఈ 8 కేటగిరీల వారికి మాత్రమే ప్రవేశానికి అనుమతి

ABN , First Publish Date - 2021-07-23T15:50:22+05:30 IST

కరోనా కారణంగా విదేశీయుల రాకపై యూఏఈ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇలా సుమారు 16 దేశాల పౌరులను తమ దేశంలోకి రాకుండా నిషేధించింది. ఈ జాబితాలో భారత్‌తో పాటు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా తదితర దేశాలు ఉన్నాయి.

Expo 2020 Dubai: ఈ 8 కేటగిరీల వారికి మాత్రమే ప్రవేశానికి అనుమతి

దుబాయ్: కరోనా కారణంగా విదేశీయుల రాకపై యూఏఈ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇలా సుమారు 16 దేశాల పౌరులను తమ దేశంలోకి రాకుండా నిషేధించింది. ఈ జాబితాలో భారత్‌తో పాటు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, డీఆర్ కాంగో, లైబీరియా, నమీబియా, నేపాల్, నైజీరియా, ఉగాండా, సియెర్రా లియోన్, శ్రీలంక, వియత్నాం, జాంబియా ఉన్నాయి. అయితే, తాజాగా Expo 2020 నేపథ్యంలో ఈ నిషేధిత దేశాల నుంచి కూడా ఎనిమిది కేటగిరీల వారిని తమ దేశంలో ప్రవేశానికి యూఏఈ అనుమతి ఇచ్చింది. వీరు కరోనా నిబంధనలను పాటించడంతో పాటు 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(జీసీఏఏ) పేర్కొంది. 


మినహాయింపు పొందిన ఎనిమిది కేటగిరీల ప్రయాణికులు వీరే...

1. యూఏఈ పౌరులు, వారి సమీప బంధువులు

2. దౌత్యాధికారులు(అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందితో సహా) 

3. ప్రత్యేక అనుమతి పొందిన అధికారిక ప్రతినిధులు

4. Expo 2020 ఇంటర్నెషనల్‌లో పాల్గొనేవారు, ప్రదర్శనకారులు, దాని నిర్వాహకులు స్పాన్సర్ చేసిన సిబ్బంది

5. గోల్డ్, సిల్వర్ రెసిడెన్సీ పర్మిట్స్ గల యూఏఈ నివాసితులు

6. విదేశీ కంపెనీల కార్గో, ట్రాన్సిట్ విమానాల సిబ్బంది

7. వ్యాపారవేత్తలు ఎవరైతే పోర్ట్స్, బోర్డర్స్ మరియు ఫ్రీ జోన్ల భద్రత కోసం జనరల్ అథారిటీ నుండి అనుమతి పొందిన వారు. అలాగే ఎమిరేట్ అత్యవసర, సంక్షోభం మరియు విపత్తు నిర్వహణ బృందాల ఉన్నత కమిటీల అధిపతుల నుండి అనుమతి కూడా పొందాల్సి ఉంటుంది

8. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ వర్గీకరణ ప్రకారం కీలకమైన విధులకు చెందిన ఉద్యోగులు


మినహాయింపు పొందిన ఈ ఎనిమిది కేటగిరీల ప్రయాణికులు అనుసరించాల్సిన కోవిడ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏంటంటే...

1. జర్నీకి 48 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి ఈ సర్టిఫికేట్ తీసుకుని ఉండాలి. అలాగే తప్పకుండా ఈ రిపోర్టుకు క్యూఆర్ కోడ్ ఉండాల్సిందే.

2. యూఏఈ చేరుకోగానే పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి. దీంతో క్వారంటైన్‌లో ఉన్న సమయంలో మరో రెండుసార్లు టెస్టులు(నాల్గో రోజు, ఎనిమిదో రోజు) చేసుకోవాల్సి ఉంటుంది. 

3. 10 రోజులు క్వారంటైన్ తప్పనిసరి

4. ప్రయాణికులు తప్పనిసరిగా మానిటరింగ్, ట్రాకింగ్ పరికరాన్ని ధరించాలి.

Updated Date - 2021-07-23T15:50:22+05:30 IST