పాస్‌పోర్టుల తనిఖీకి ఎనిమిది బృందాలు

ABN , First Publish Date - 2021-03-02T05:28:10+05:30 IST

బోధన్‌లో వెలుగుచూసిన నకిలీ పాస్‌పోర్టుల వ్యవహారంతో అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం లోతైన దర్యాప్తునకు ఉపక్రమించింది. ఇప్ప టికే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు అధికారులు, అక్కడి పోలీసు బృందాలు 72 నకిలీ పాస్‌పోర్టులను గుర్తించడం, ఈ వ్యవ హారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో జిల్లా పో లీసు యంత్రాంగం అప్రమత్తమయ్యింది.

పాస్‌పోర్టుల తనిఖీకి ఎనిమిది బృందాలు

ఇంటింటికీ తిరుగుతూ తనిఖీ చేస్తున్న అధికారులు

బోధన్‌, మార్చి 1 : బోధన్‌లో వెలుగుచూసిన నకిలీ పాస్‌పోర్టుల వ్యవహారంతో అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం లోతైన దర్యాప్తునకు ఉపక్రమించింది. ఇప్ప టికే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు అధికారులు, అక్కడి పోలీసు బృందాలు 72 నకిలీ పాస్‌పోర్టులను గుర్తించడం, ఈ వ్యవ హారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో జిల్లా పో లీసు యంత్రాంగం అప్రమత్తమయ్యింది. నకిలీ పాస్‌పోర్టు ల జారీలో కీలకమైన ఎస్‌బీ అధికారులు మల్లేష్‌, అనిల్‌ల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వీరు ఎస్‌బీలో 2016 నుంచి 2021 వరకు విధులు నిర్వహించి.. వందల సంఖ్య లో పాస్‌పోర్టులకు క్లియరెన్స్‌ ఇచ్చారు. బోధన్‌ డివిజన్‌ ప రిధిలోని బోధన్‌, కోటగిరి, వర్ని, రెంజల్‌, ఎడపల్లి, రుద్రూ రు, మోస్రా, చందూరు మండలాల్లో పాస్‌పోర్టులను జారీ చేయించారు. వీరి కాలంలో వందల సంఖ్యలో పాస్‌పోర్టుల ఎంక్వైయిరీ జరిగి కొత్త పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. అ యితే, వీటన్నింటిపై దృష్టి పెట్టిన పోలీసుశాఖ లోతైన ద ర్యాప్తునకు చర్యలు చేపట్టింది. ఎనిమిది బృందాలను ప్రత్యే కంగా ఏర్పాటుచేసి ఒక్కో బృందంతో రోజువారి పాస్‌పోర్టు లను క్షేత్రస్థాయిలో పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో బృందానికి 30 పాస్‌పోర్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించే లా విధులను అప్పగించారు. ఈ ఎనిమిది బృందాలు డివి జన్‌ పరిధిలోని వివిధ మండలాలలో ఆ ఇద్దరు ఎస్‌బీ అధి కారులు పనిచేసిన మండలాలలో విచారణ చేపడుతున్నా రు. జారీ అయిన పాస్‌పోర్టులు ఇంటి నెంబర్లు, ఆధార్‌ కా ర్డులు, ఓటర్‌ ఐడీ కార్డులు ఇతర వివరాలను సేకరిస్తున్నా రు. పాస్‌పోర్టులు అసలు వ్యక్తులకు జారీ అయ్యాయా? న కిలీ వ్యక్తులకు జారీ అయ్యాయా? అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. ప్రత్యేక బృందాల క్షేత్రస్థాయి పరిశీలనతో మరిన్ని నకిలీ పాస్‌పోర్టులు వెలుగుచూస్తుండడం ఆ ఇద్ద రు అధికారుల అవినీతి బాగోతాన్ని బహిర్గతం చేస్తోంది. ప్రత్యేక బృందాల ఏర్పాటు, తనిఖీల పర్వంతో పోలీసుశాఖ నకిలీ పాస్‌పోర్టుల గుట్టును పూర్తిస్థాయిలో రట్టు చేసేం దుకు సిద్ధమయ్యింది. భవిష్యత్తులో కూడా రాష్ట్రస్థాయి ఉ న్నతాధికారులు ఎలాంటి విచారణ చేసినా ఈ వ్యవహారం లో ఎలాంటి తప్పిదాలు బహిర్గతం కాకుండా జిల్లా పోలీ సులు లోతుగా విచారణ చేసి, పూర్తిస్థాయి నివేదికలు రూ పొందించే పనిలో నిమగ్నమయ్యారు.

Updated Date - 2021-03-02T05:28:10+05:30 IST