దంతెవాడ జిల్లాలో 18 మంది మావోయిస్టుల లొంగుబాటు

ABN , First Publish Date - 2020-07-02T15:23:52+05:30 IST

చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో 18 మంది మావోయిస్టులు జిల్లాకలెక్టరు, జిల్లా ఎస్పీల ముందు లొంగిపోయారు.....

దంతెవాడ జిల్లాలో 18 మంది మావోయిస్టుల లొంగుబాటు

దంతెవాడ (చత్తీస్‌ఘడ్): చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో 18 మంది మావోయిస్టులు జిల్లాకలెక్టరు, జిల్లా ఎస్పీల ముందు లొంగిపోయారు. మావోయిస్టు అనుబంధ సంస్థ అయిన చేతన నాట్యమండలి, దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్ కుచెందిన  18మంది మావోయిస్టులు లొంగిపోయారు.మావోయిస్టులు తిరిగి ఇంటికి రండి అంటూ చత్తీస్‌ఘడ్ పోలీసులు చేసిన ప్రచార కార్యక్రమంతో 18మంది మావోయిస్టులు తీవ్రవాదానికి స్వస్థి చెప్పి లొంగిపోయారని, వారికి టైలరింగ్, డ్రైవింగ్, నిర్మాణ పనుల్లో శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని సీఆర్ పీఎఫ్ డీఐజీ అభిషేక్ పల్లవ్ చెప్పారు. 18 మంది మావోయిస్టులు తమ తుపాకులను భాన్సీ పోలీసుస్టేషనులో అప్పగించి లొంగిపోయారని, వారి తలపై ఉన్న లక్షరూపాయల రివార్డును వారికి అందిస్తామని పోలీసులు చెప్పారు.లొంగిపోయిన మావోయిస్టులు రైలు పట్టాల ధ్వంసం, స్కూలు భవనాల కూల్చివేత తదితర కేసుల్లో నిందితులని పోలీసులు చెప్పారు. సీనియర్ మావోయిస్టు కమాండర్ ను అరెస్టు చేశామని ఐటీబీపీ పోలీసులు చెప్పారు. బుల్లెట్ గాయంతో ఉన్న కమాండరును ఆసుపత్రికి తరలించామని పోలీసులు వివరించారు. 

Updated Date - 2020-07-02T15:23:52+05:30 IST