Abn logo
Oct 1 2020 @ 08:45AM

పుల్వామాలో ఉగ్రవాద సంస్థలో చేరిన యువకుడి అరెస్ట్

Kaakateeya

పుల్వామా (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని పుల్వామాలో ఇంటి నుంచి పారిపోయి ఉగ్రవాద సంస్థలో చేరిన 18 ఏళ్ల యువకుడిని భారత సైనిక విభాగానికి చెందిన చినార్ కార్ప్సు జవాన్లు అరెస్టు చేశారు. పుల్వామా జిల్లాలోని అవంతిపొర పాంపొరి ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఈ నెల 11వతేదీ నుంచి ఇంటి నుంచి పారిపోయాడు. ఇంటి నుంచి పారిపోయిన యువకుడు తాను ఉగ్రవాద సంస్థలో చేరినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. యువకుడు ఇంటి నుంచి పారిపోయి ఉగ్రవాద సంస్థలో చేరినట్లు సోషల్ మీడియాలో ఆడియో మెసేజ్ పెట్టారు. దీంతో తాము యువకుడిని గుర్తించి తాము అరెస్టు చేశామని చినార్ కార్ప్సు ట్వీట్ చేసింది. 

Advertisement
Advertisement
Advertisement