Apr 17 2021 @ 00:13AM

‘ఏక్ మినీ కథ’ విడుదల తేదీ ఫిక్సయింది

టాలీవుడ్ టాప్ బ్యానర్స్‌లో ఒకటైన యూవీ క్రియేషన్స్ సంస్థకు అనుబంధ సంస్థ అయిన యూవీ కాన్సెఫ్ట్స్ బ్యానర్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఏక్ మినీ కథ’. డజ్ సైజ్ మ్యాటర్ అనేది ట్యాగ్ లైన్. పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన వీడియోలు, పోస్టర్స్ మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర విడుదల తేదీని చిత్రయూనిట్ ఫిక్స్ చేసినట్లుగా అఫీషియల్‌గా ప్రకటించారు. ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నామని మేకర్స్ ప్రకటించారు.


వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథ అందించగా.. కార్తీక్ రాపోలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు.