Abn logo
Oct 21 2021 @ 22:53PM

ఈకేవైసీ నమోదు చేయించుకోవాలి

వరి పొలాలను పరిశీలిస్తున్న ఏవో పార్థసారథి

పెంటపాడు, అక్టోబరు 21: ఈ–క్రాప్‌లో రైతులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ (బయోమెట్రిక్‌) నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి కె.పార్థసారథి అన్నారు. గురువారం పెంటపాడులో వరి పొలాలను పరిశీలించి మాట్లాడారు. ఈకేవైసీ నమోదు చేసుకున్న రైతులు మాత్రమే రైతు భరోసా కేంద్రాలలో పండించిన ధాన్యాన్ని అమ్మకాలు జరుపుకునేందుకు అర్హులన్నారు. ప్రస్తుతం వరిచేలల్లో ఆకుఎండు తెగులు లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. దీని నివారణకు ఎకరానికి 100 గ్రాముల  ప్లాంటోమైసిన్‌, 200 గ్రాములు  కాఫర్‌ హై డ్రాక్సయిడ్‌ మందును 200 లీటర్ల నీటిలో కలిపి  పిచికారి చేసుకోవాలన్నారు. దీని వల్ల తెగులు ఇతర మొక్కలకు వ్యాపించకుండా ఉంటుందన్నారు. అవసరానికి మాత్రమే ఎరువులు, పురుగుమందులు వినియోగించాలన్నారు.