Abn logo
Sep 22 2021 @ 16:08PM

ఎలాన్ సంపద ఆవిరి

న్యూయార్క్ : చైనా రియాల్టీ మార్కెట్లో ఎవర్ గ్రాండ్ వాటా రెండు  శాతం కాగా, దీనికి గతేడాది లిక్విడిటీ సమస్య ఏర్పడింది. మొత్తం 15 లక్షలమందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంది. కాగా... కంపెనీ తన ఉద్యోగులకు వేతనాలనివ్వలేని స్థితికి చేరుకుంది. సంస్థకు మొత్తం 300 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 22.50 లక్షల కోట్లు) అప్పులున్నాయి. వీటిని తగ్గించుకోవడానికు ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో... 2023 మధ్యనాటికి వంద బిలియన్ డాలర్ల రుణాలను తీర్చాలని యత్నిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 8 బిలియన్ డాలర్లను మాత్రమే సమీకరించుకోగలిగింది. ఎవర్ గ్రాండ్ సంక్షోభం నేపధ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోవడంతో ప్రపంచవ్యాప్తంగా టాప్ 500 మంది ధనవంతుల సంపద ఒక్కరోజే 135 బిలియన్ డాలర్ల(రూ. 10 లక్షల కోట్లు మేర క్షీణించింది. 


కుబేరుల సంపద హుష్ కాకి...

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద 7.2 బిలియన్ డాలర్లు తగ్గి 198 బిలియన్ డాలర్లకు క్షీణించింది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద 5.6 బిలియన్ డాలర్లు తగ్గి 194.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఎవర్ గ్రాండ్ షేర్లు దశాబ్దకాల కనిష్ఠానికి చేరుకున్నాయి. దీంతో 2017లో 42 బిలియన్ డాలర్ల వద్ద గరిష్ఠానికి చేరుకున్న ఎవర్ గ్రాండ్ ఛైర్మన్ హుయ్-కా-యువాన్ సంపద తాజాగా 7.3 బిలియన డాలర్లకు తగ్గింది.


ఎలాన్ మస్క్ సంపద  ఆవిరి...

సంక్షోభం నుంచి బయటపడతామని చైనా రియాలిటీ దిగ్గజం ఎవర్‌గ్రాండ్ సంస్థ చైర్మన్ హుయ్ కా యువాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన ఉద్యోగులకు ఈ మేరకు ఆలత లేఖ రాశారు. తాము చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ తప్పకుండా పూర్తి చేస్తామని, ఉద్యోగుల సహకారంతో ఈ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుత సంక్షోభం నుండి బయటపడటానికి దేశీయ బాండ్ హోల్డర్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఎవర్ గ్రాండ్ వెల్లడించింది. ఎవర్ గ్రాండ్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిందనే వార్తలు ప్రపంచ మార్కెట్లను... ప్రత్యేకించి... రియాలిటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. బాండ్ కూపన్ చెల్లింపులను ఈ(సెప్టెంబరు) నెల 23 న జరుపుతామని ఎవర్ గ్రాండ్ గ్రూప్ తెలిపింది. ఈ రియల్టర్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతుందనే ఆందోళన నేపధ్యంలో ఇది కాస్త ఊరట కలిగించే అంశమేనని చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా సేల్ చేసిన డెవలపర్ ఎవర్ గ్రాండ్. ఎవర్ గ్రాండ్ యూనిట్ హంగ్డే రియల్ ఎస్టేట్ గ్రూప్ బాండ్‌కు సంబంధించి ప్రకటన చేసింది. డేటా ప్రకారం హెంగ్డే రియల్ ఎస్టేట్ కూప్న్ చెల్లింపు మొత్తం 232 మిలియన్ యువాన్లు(35.88 మిలియన్ డాలర్లు).


ఇవి కూడా చదవండిImage Caption