వారం రోజులుగా... క్షీణిస్తోన్న ఎలాన్ మస్క్ సంపద...

ABN , First Publish Date - 2021-03-07T22:30:07+05:30 IST

కిందటి సంవత్సరం భారీగా పెరిగిన టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ సంపద... గత వారం రోజులుగా కరిగిపోతూ వస్తోంది. నిరుడు భారీగా పెరిగిన ఆయన సంపదలో ఎక్కువ శాతం ఈ వారంలో బాగా తగ్గిపోయింది. సోమవారం నుండి నిన్నటి శుక్రవారం వరకు ఆయన ఏకంగా 27 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు.

వారం రోజులుగా... క్షీణిస్తోన్న ఎలాన్ మస్క్ సంపద...

క్యాలిఫోర్నియా :  కిందటి సంవత్సరం భారీగా పెరిగిన టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ సంపద... గత వారం రోజులుగా కరిగిపోతూ వస్తోంది. నిరుడు భారీగా పెరిగిన ఆయన సంపదలో ఎక్కువ శాతం ఈ వారంలో బాగా తగ్గిపోయింది. సోమవారం నుండి నిన్నటి శుక్రవారం వరకు ఆయన ఏకంగా 27 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 156.9 బిలియన్ డాలర్ల ఆదాయంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన రెండో స్థానంలో ఉన్నారు.


అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపదతో పోలిస్తే ఎలాన్ మస్క్ ఆదాయం 20 బిలియన్ డాలర్లు తక్కువగా ఉంది. కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో... గత నాలుగు వారాల్లో ఎలాన్ మస్క్ సంపద క్షీణించింది. టెస్లా స్టాక్స్ వ్యాల్యూ కూడా ఈ సమయంలో 230 బిలియన్ డాలర్ల మేర పడిపోయింది. ఒక్క వారంలోనే సంస్థ షేర్ల విలువ 11 శాతం పడిపోవడం గమనార్హం. 


పద్ధెనిమిది నెలల కాలంలో ఇది దారుణమైన పతనం. అంటే... 2019 మే తర్వాత... ఈ స్థాయిలో పతనం కావడం ఇది మొదటిసారి. అమెరికాలో బాండ్స్ మార్కెట్ల వల్ల నెలకొన్న ప్రతికూలతలే టెస్లా స్టాక్ పతనానికి కారణమని చెబుతున్నారు. కంపెనీ మార్కెట్ వ్యాల్యూ జనవరిలో 837 బిలియన్ డాలర్లు కాగా, ఇప్పుడు 574 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కిందటి సంవత్సరం  కంపెనీ షేర్ల విలువ 743 శాతం ఎగసింది. కొత్త ఏడాదిలోను ప్రారంభంలో అదే జోరు కనిపించింది. జెఫ్ బెజోస్‌ను కూడా మించిన సందర్భముంది. మార్కెట్ల ప్రతికూలతలతో ఆ స్థానంలో ఆయన ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. ఇటీవల టెస్లా పెట్టుబడులు పెట్టిన బిట్ కాయిన్ జోరు కూడా తగ్గిపోవడం గమనార్హం. 

Updated Date - 2021-03-07T22:30:07+05:30 IST