టీడీపీలోనే మహిళలకు సముచిత స్థానం

ABN , First Publish Date - 2021-03-09T07:01:33+05:30 IST

తెలుగుదేశం పార్టీ మహిళలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

టీడీపీలోనే మహిళలకు సముచిత స్థానం
మచిలీపట్నంలో లోకేశ్‌ ప్రచారం

బందరులో నారా లోకేశ్‌ విస్తృత ప్రచారం

మచిలీపట్నం టౌన్‌, మార్చి 8 :  తెలుగుదేశం పార్టీ మహిళలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. మచిలీపట్నం నగర పాలక సంస్థ టీడీపీ మేయర్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్న కొట్టె జయలక్ష్మిని గెలిపించాల్సిందిగా కోరారు.  మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొమ్మిదో డివిజన్‌ పరాసుపేట సెంటర్‌ వద్ద  బహిరంగ సభలో లోకేశ్‌ మాట్లాడుతూ, మేయర్‌ అభ్యర్థిగా జయలక్ష్మి పేరును ప్రకటించారు. టీడీపీ అభ్యర్థులు,  కార్యకర్తలు కరతాళ ధ్వనులు చేశారు. బందరు చరిత్రలో తొలి సారిగా మేయర్‌ అభ్యర్థిగా మహిళను ప్రకటి స్తున్నట్లు లోకేశ్‌ తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తొమ్మిదో డివిజన్‌లో మాజీ కౌన్సిలర్‌ కొట్టె వెంకట్రావు తన సొంత నిధు లతో కెవిఆర్‌ పార్కును అభివృద్ధి చేశారన్నారు.  వార్డును మోడల్‌ వార్డుగా తీర్చిదిద్దారన్నారు. జయ లక్ష్మి డివిజన్‌ను అభి వృద్ధిపథంలో నడిపిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులను   గెలిపిస్తే జయలక్ష్మిని మేయ ర్‌గా ఎన్నుకుంటారన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, టీడీపీ మేయర్‌ అభ్యర్థి పదవిని కాపు సామాజిక వర్గానికి చెందిన జయలక్ష్మికి ఇస్తున్నామన్నారు. దమ్ముంటే మంత్రి పేర్ని నాని వైసీపీ మేయర్‌ అభ్యర్థిని ప్రకటిం చాలని రవీంద్ర సవాల్‌ విసిరారు. మాజీ ఎంపీ, బందరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ రావు, మాజీ డిప్యూటీ స్పీకర్‌  బూరగడ్డ వేద వ్యాస్‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ కౌన్సిలర్‌ కొట్టె వెంకట్రావు, మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ గోపు సత్యనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇలియాస్‌ పాషా, రూరల్‌ పార్టీ అధ్యక్షుడు కుంచే నాని,  పాల్గొన్నారు.



Updated Date - 2021-03-09T07:01:33+05:30 IST