Abn logo
Sep 22 2021 @ 01:25AM

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

రాజిరెడ్డి (ఫైల్‌ ఫొటో)

తుర్కపల్లి, సెప్టెంబరు 21: భువనగిరి-గజ్వేల్‌ రహదారిపై మండలంలోని రుస్తాపూర్‌ గ్రామ శివారులో మంగళ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఎస్‌ఐ మధుబాబు తెలిపిన వివరాల ప్రకారం..  బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామా నికి చెందిన ముత్యాల రాజిరెడ్డి (60) మంగళవారం ఉద యం బామమరిది అంత్యక్రియల కోసం బైక్‌పై సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం కొత్తపేట గ్రామానికి వెళ్ళా డు. సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా రుస్తాపూర్‌ గ్రామ శివారులో భువనగిరి వైపు నుంచి ఎదురుగా వస్తున్న డీసీఎం బైక్‌ను డీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయమైన రాజిరెడ్డి అక్కడి క్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానిక ఎస్‌ఐ చేరుకుని  మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.