వైసీపీ నేతల బెదిరింపులు భరించలేక ఎలక్షన్ ఏజెంట్ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-02-25T04:14:57+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల తరువాత జరిగిన రాజకీయ పరిణామాలకు ఓ యువకుడు ఆత్మహత్య

వైసీపీ నేతల బెదిరింపులు భరించలేక ఎలక్షన్ ఏజెంట్ ఆత్మహత్య

కాకినాడ: స్థానిక సంస్థల ఎన్నికల తరువాత జరిగిన రాజకీయ పరిణామాలకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యర్థి పార్టీ వేధింపులు భరించలేక ఆ యువకుడు జీవితం చాలించాడు. ఈ ఘటన అల్లపురం రూరల్ మండలంలోని నడిపూడి గ్రామంలో జరిగింది. గ్రామంలోని మెట్టరాంజీ కాలనీకి చెందిన రవిశంకర్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నడిపూడి పంచాయతీ 11 వార్డుకు ఓ పార్టీ తరపున రవిశంకర్ బూతు ఏజెంట్‌గా పనిచేశాడు. 


ఎన్నికలపుడు వైసీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. వైసీపీ నేతల రిగ్గింగ్‌ను రవిశంకర్ అడ్డుకున్నారు. దీంతో రవిశంకర్‌ను చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరించారు. వైసీపీ నేతల బెదిరింపులు భరించలేక రవిశంకర్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు వైసీపీ నేతల వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తమ కొడుకు ఆత్మహత్యకు వైసీపీ నేతల వేధింపులే కారణమని రవిశంకర్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. అలాగే రవిశంకర్ ఆత్మహత్యపై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.  


Updated Date - 2021-02-25T04:14:57+05:30 IST