నోడల్ అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ ఆర్వీకర్ణన్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎన్ మధుసూదన్
నోడల్ అధికారులతో కలెక్టర్, రిటర్నింగ్ అధికారి
ఖమ్మం కలెక్టరేట్, మార్చి 1: శాసనమండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలుచేయాలని కలెక ్టర్ ఆర్వీ కర్ణన్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎన్. మధుసూదన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో నోడల్ అధికారులు, సెక్టోరియల్, జోనల్ అధికారులతో ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా మోడల్కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలు, బందోబస్తు పకడ్బందీగా ఉండాలని, సభలు సమావేశాలకు ముందస్తు అనుమతులు విధిగా తీసుకోవాలని అన్నారు. నోడల్ అధికారులు, జోనల్, సెక్టోరియల్ అధికారులకు కేటాయించిన ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. శాసన మండలి ఎన్నికల్లో ప్రధానంగా ఖమ్మం అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా పోలింగ్ లోకేషన్లు, పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని జోనల్, సెక్టోరియల్ అధికారులు వీటిని ముందస్తుగానే తనిఖీలు చేసి సరిచూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ సామగ్రి డిస్ర్టిబ్యూషన్ సెంటర్ ఎస్సార్బీజీఎన్నార్ కళాశాలలో ఉంటుందన్నారు. రిసెప్షన్ సెంటర్ మాత్రం నల్గొండలో ఉంటుందని పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను ఇతర పోలింగ్ సామగ్రిని నల్గొండ రిసెప్షన్ కేంద్రానికి చేర్చాలని, జోనల్ రూట్ సెక్టోరియల్ అధికారులు ప్రత్యేక బందోబస్తుతో సంబందిత ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్అధికారులతో రిసెప్షన్ కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. పోలింగ్ అధికారులు సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 2, 9వ తేదీన రెండు పర్యాయాలు శిక్షణ తరగతులను నిర్వహించాలన్నారు. తహసీల్దార్లు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే చేసుకోవాలన్నారు. మోడల్కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరక్కుండా సత్వర చర్యలు చేపట్టాలని వారు ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది సామగ్రి తరలించేందుకు అవసరమైన వాహనాలను ముందస్తుగానే సమకూర్చుకోవాలని ట్రాన్స్పోర్టేషన్ నోడల్ అధికారిని కలెక్టర్ ఆదేశింఆచరు. సున్నిత సమస్యాత్మక పోలింగ్ లోకేషన్లు, పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలతో బందోబస్తు ఉండాలని మొబైల్ పెట్రోలింగ్ నిరంతరం కొనసాగాలని ఎక్కడా మోడల్కోడ్ ఉల్లంఘన జరక్కుండా పోలీసులు బందోబస్తు నిఘా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో నోడల్ అధికారులు, జోనల్, సెక్టోరియల్ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.