బద్వేల్ ఉపఎన్నికలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన
ABN , First Publish Date - 2021-10-24T02:46:19+05:30 IST
బద్వేల్ ఉపఎన్నికలో వైద్య ఆరోగ్యశాఖ ఎన్నికల కోడ్
కడప: బద్వేల్ ఉపఎన్నికలో వైద్య ఆరోగ్యశాఖ ఎన్నికల కోడ్ ఉల్లంఘించింది. పోరుమామిళ్ల, బి.కోడూరు మండలాల్లోని ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు, వాచీలను పంపిణీ చేసింది. టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 43 మంది ఆశా కార్యకర్తలకు వాటిని వైద్యులు పంపిణీ చేసారు. గర్భిణీ స్త్రీ, శిశువుల వివరాలను ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసేందుకు స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేసారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.