జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషనర్ సమావేశం

ABN , First Publish Date - 2020-09-30T00:04:49+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమావేశం నిర్వహించారు. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు అంతా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని ప్రకటించారు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషనర్ సమావేశం

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమావేశం నిర్వహించారు. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు అంతా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని ప్రకటించారు. టెక్నాలజీ ద్వారా తక్కువ సమయంలో తక్కువ సిబ్బందితో ఎన్నికల నిర్వహిస్తామని తెలిపారు. వార్డుకు ఒక పోలింగ్‌ కేంద్రంలో ఫేస్ రికగ్నేషన్ యాప్ వాడతామని, ఫేస్ రికగ్నేషన్ యాప్‌తో ఓటర్ల పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఈ-ఓటింగ్ విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. టీ పోల్ ద్వారా అభ్యర్థుల వివరాలు తెలుసుకోవచ్చని, ఓటర్‌ లిస్ట్‌, పోలింగ్ కేంద్రాల జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచుతామని పార్థసారథి ప్రకటించారు.

Updated Date - 2020-09-30T00:04:49+05:30 IST