Abn logo
Sep 19 2021 @ 01:07AM

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

కాకినాడ సిటీ, సెప్టెంబరు18: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. శనివారం కాకినాడ అశోక్‌నగర్‌లో మహిళ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన కాకినాడ గ్రామీణం, కరప, పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి మండలాల స్ట్రాంగ్‌రూమ్‌లను, కౌంటింగ్‌ కేంద్రాలను కాకినాడ కార్పొరేషన్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏడు డివిజన్లలో 12 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే కౌంటింగ్‌ సిబ్బందికి అన్ని అంశాల పట్ల శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రాఽథమిక ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం తుది ఓట్ల లెక్కింపు ప్రారంభించి మూడు రౌండ్లలో పూర్తి చేసి ఫలితాలు ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్‌ వెంట ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ, హార్టికల్చర్‌ డీడీ రామ్మోహనరావు, సీపీవో పి బాలాజీ, ఎంహెచ్‌వో పృఽథ్వీచరణ్‌, కాకినాడ రూరల్‌ ఎంపీడీవో నారాయణమూర్తి, తహశీల్దార్‌ మురళీకృష్ణ, కరప ఎంపీడీవో స్వప్న, తహశీల్దార్‌ విశ్వేశ్వరరావు, పెదపూడి ఎంపీడీవో విజయభాస్కర్‌, తహశీల్దార్‌ సుభాష్‌, సామర్లకోట తహశీల్దార్‌ జితేంద్ర, తాళ్లరేవు ఎంపీడీవో విజయ్‌థామస్‌, తహశీల్దార్‌ చినబాబు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.