Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్టీసీలో ఎన్నికల హారన్‌

మొదలైన నామినేషన్ల ప్రక్రియ

తొలిరోజు ఎనిమిది దాఖలు

ఒంగోలు (కార్పొరేషన్‌), నవంబరు 29 : ఆర్టీసీలో ఎన్నికల హారన్‌ మోగింది.   కార్మిక సంఘాల్లో కోలాహలం నెలకొంది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ సంఘాల నుంచి 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వచ్చేనెల 6 వరకూ స్వీకరణకు గడువు ఉంది. 7వ తేదీ ఉపసంహరణలు ఉంటాయి. 8వ తేదీ తుది జాబితా ప్రకటిస్తారు. 14న ఎన్నిక నిర్వహిస్తారు. జిల్లాలో ఎనిమిది డిపోలు ఉండగా పోటీకి కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఐక్యకూటమి (ఎంప్లాయీస్‌ యూనియన్‌, కార్మిక పరిషత్‌), నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌,  ఎస్‌డబ్ల్యూఎఫ్‌, కార్మిక పరిషత్‌, వైస్సార్‌ కార్మిక సంఘం, ఎస్సీ ఉద్యోగల సంక్షేమ సంఘం ప్రధానంగా అభ్యర్థులను రంగంలోకి దించుతున్నాయి. ఒంగోలు డిపోలో ఎంప్లాయీస్‌ యూనియన్‌, కార్మిక పరిషత్‌ ఐక్యకూటమి తరఫున కండక్టర్లు జి.మాధవరావు, సిహెచ్‌.వెంకటేశ్వర్లు, పోతుపాలెం శ్రీనివాసరావు గ్యారేజీ తరఫున పి.సత్యానంద్‌ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. వీరికి డమ్మీలుగా నలుగురు పత్రాలు సమర్పించారు. 

Advertisement
Advertisement