నియోజకవర్గంలో ఎన్నికల సందడి

ABN , First Publish Date - 2021-01-26T06:36:34+05:30 IST

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో ఎన్నికలకు అడ్డంకులు తొలగాయి.

నియోజకవర్గంలో ఎన్నికల సందడి

2 నుంచి నామినేషన్ల స్వీకరణ

గిద్దలూరు, జనవరి 25 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో ఎన్నికలకు అడ్డంకులు తొలగాయి. గిద్దలూరు నియోజకవర్గంలో మారిన ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 13న పోలింగ్‌ జరుగనున్నది. నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో 95 పంచాయతీలు ఉన్నాయి. గిద్దలూరు మండలంలో 19 పంచాయతీలు, రాచర్లలో 14, కొమరోలులో 14, కంభంలో 14, బేస్తవారపేటలో 19, అర్థవీడు మండలంలో 15 పంచాయతీలు ఉండగా మొత్తం 95 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 2న నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 4 వరకు నామినేషన్ల దాఖలుకు తుదిగడువు, 5న పరిశీలన, 6న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీలు, 7న అప్పీళ్ల పరిష్కారం, 8న ఉపసంహరణ, 13న పోలింగ్‌ ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2021-01-26T06:36:34+05:30 IST