ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎ్‌సదే విజయం

ABN , First Publish Date - 2021-12-05T07:03:41+05:30 IST

న్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయం అన్న విషయాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరొకసారి రుజువు చేయాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎ్‌సదే విజయం
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి, పక్కన గుత్తా, కోటిరెడ్డి, భూపాల్‌రెడ్డి

 కోటిరెడ్డి విజయం లాంఛనమే

విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి 

నల్లగొండ, డిసెంబరు 4: ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయం అన్న విషయాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరొకసారి రుజువు చేయాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ శనివారం జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల స్థానిక సంస్థల ఓటర్లతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి జగదీ్‌షరెడ్డి మాట్లాడుతూ అధిష్ఠానం ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థుల విజయం కోసం కోటిరెడ్డి పనిచేశారని, గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం ప్రయత్నం చేసి తనకు టికెట్‌ రాకపోయినా పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేశారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోటిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట మేరకు కోటిరెడ్డికి అవకాశం కల్పించారన్నారు. ఓటర్లందరూ క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. విజయం ఖాయమైనప్పటికీ జాగ్రత్తగా తమ ఓటు హక్కును వినియోగించాలన్నారు. కోటిరెడ్డి విజయం లాంఛనమేనని, భారీ మెజారిటీతో ఆయన గెలవబోతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణలో జనరంజక పాలనను అందజేస్తున్నారన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలతోపాటు ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, దళితబంధువంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. దేశానికే అన్నం పెట్టే విధంగా తెలంగాణ రైతు ఎదిగాడని, లక్షలాది ఎకరాల్లో పంటలు పండిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణచూసి కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపేందుకు కేసీఆర్‌ కృషిచేస్తుంటే బీజేపీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ఎంసీ కోటిరెడ్డిని భారీ మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. సమావేశంలో పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితోపాటు నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-05T07:03:41+05:30 IST