Abn logo
Sep 25 2021 @ 00:43AM

ఎమ్మెల్యే కనుసన్నల్లో ఎంపీపీ ఎన్నిక

మండల పరిషత కార్యాలయం తలుపులు మూసి.. ఎంపీపీ ఎన్నిక చేపట్టిన దృశ్యం

వైసీపీలో తీవ్ర అసంతృప్తి 


బ్రహ్మసముద్రం, సెప్టెంబరు24:మండల ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక రసవత్తరంగా సాగింది. ఎమ్మెల్యే ఉ షాశ్రీచరణ్‌ కనుసన్నల్లో... ఏకంగా మండల పరిషత కా ర్యాలయం తలుపులు మూసి తతంగం నడిపారు. శుక్రవా రం మండల పరిషత కార్యాలయంలో ఎంపీపీ ఎన్నిక  ప్రక్రియ కొనసాగింది. ఉదయం కోఆప్షన సభ్యురాలిగా ఎస్‌ పార్వతి ఏకగ్రీవంగా ఎన్నికైంది. మధ్యాహ్నం ఎంపీపీ ఎన్నిక తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే సమావేశం హాలులోకి వెళ్లి తలుపులు మూసి అధికారపార్టీ ఎంపీటీసీలందరికి  హితబోధ చేశారు. ఎన్నిక ప్రక్రియను గోప్యంగా ముగించారు. ఎంపీపీగా చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్‌ ఎంపీపీగా వెంకటేష్‌నాయక్‌ను ఎన్నుకున్నారు. మండలపరిషత కార్యాలయంలోనే ఎమ్మెల్యే ఉదయం 11 గంటల నుంచి మకాం వేశారు. తాను సూచించిన వ్యక్తిని బలపరచాలని ఎంపీటీసీలకు సూచించినట్లు తెలిసింది. కాగా వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసిన వారికి కాకుం డా.. ఎన్నికల ప్రక్రియ ముందు పార్టీలో చేరిన వారిని ఎంపీపీగా నియమించడం పట్ల వైసీపీ నాయకులు, కార్య కర్తలు తీవ్ర అసంతృప్తికిలోనయ్యారు. ఎన్నికల ప్రక్రియ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీ ఐ తేజోమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పా టు చేశారు.