Abn logo
Sep 18 2021 @ 00:55AM

ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు

  • జడ్పీ బాలుర పాఠశాల, బీవీసీ కళాశాలలో లెక్కింపు కేంద్రాలు
  • మండలాల వారీగా కౌంటింగ్‌పై ఎన్నికల సిబ్బందికి శిక్షణ

(అమలాపురం-ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు నకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమలాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న 16 మండలాలకు పట్టణంలోని జడ్పీ హైస్కూలులో ఎనిమిది మండ లాలు, ఇందుపల్లి శివారు భట్లపాలెంలోనీ బీవీసీ కళాశాలలో మరో ఎని మిది మండలాల ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించడానికి అధికారు లు సన్నద్ధమవుతున్నారు. డివిజన్‌ పరిధిలో 304 ఎంపీటీసీ స్థానాల్లో 793మంది అభ్యర్థులు, 16 జడ్పీటీసీ స్థానాలకు 72మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కౌంటిగ్‌ కేంద్రాలను ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్థానిక జిల్లా పరి షత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఆత్రేయపురం, కొత్తపేట, కాట్రేనికోన, రావులపాలెం, ముమ్మిడివరం, ఐ.పోలవరం, అయినవిల్లి, అంబాజీపేట మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహిస్తారు. బీవీసీ కళాశాలలో అల్లవరం, మామిడికుదురు, రాజోలు, పి.గన్నవరం, సఖినేటిపల్లి, ఉప్పలగుప్తం, మలికిపురం, అమలాపురం రూరల్‌ మండలాల కౌంటింగ్‌ను నిర్వహిస్తారు. కౌంటింగ్‌పై ఆర్డీవో తగు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట ఎంపీడీవో ఎం.ప్రభాకరరావు, తహశీల్దార్‌ గెడ్డం రవీంద్రనాథ్‌ఠాగూర్‌, పంచాయతీరాజ్‌ డీఈ పీఎస్‌ రాజ్‌కుమార్‌ ఉన్నారు.