ఎన్నికలు, కౌంటింగ్.. మొత్తం ఏకపక్షమే: సీపీఐ రామకృష్ణ

ABN , First Publish Date - 2021-09-16T21:44:35+05:30 IST

విజయవాడ: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నుంచి.. పోలింగ్, కౌంటింగ్ వరకూ అంతా ఏకపక్షంగా సాగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

ఎన్నికలు, కౌంటింగ్.. మొత్తం ఏకపక్షమే: సీపీఐ రామకృష్ణ

విజయవాడ: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నుంచి.. పోలింగ్, కౌంటింగ్ వరకూ అంతా ఏకపక్షంగా సాగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు అధికార వైసీపీకి అనుకూలంగా వచ్చిందన్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం.. వైసీపీ దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాలతోనే సాగిందని మండిపడ్డారు.


పోలింగ్‌కు ముందు కనీసం నాలుగు వారాల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉండాలన్న.. సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతరు చేయలేదని చెప్పారు. ఈ ఎన్నికలను రద్దు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును.. హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిందన్నారు. ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుందని రామకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - 2021-09-16T21:44:35+05:30 IST