Abn logo
Sep 27 2021 @ 23:16PM

మైలవరం జలాశయం గేట్లకు విద్యుత్‌ కాంతులు

మైలవరం జలాశయం వద్ద గేట్ల వద్ద ఏర్పాటు చేసిన లైట్లు

మైలవరం, సెప్టెంబరు 27: మైలవరం జలాశయం అభివృద్ధి పనులలో భాగంగా 13 గేట్లకు 13 ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేయడంతో ప్రాజెక్టు గేట్లు విద్యుత్‌ కాంతులతో మెరిసిపోతున్నాయి. సోమ వారం  రాత్రి విద్యుత్‌ లైట్లను ఆన్‌చేయడంతో ఆ ప్రాంత మంతా సుందరంగా వెన్నెల  వాతావరణాన్ని కలిగించింది.  మైలవరం  జలాశయానికి దాదాపు పది సంవత్సరాల తర్వాత గేట్ల వద్ద లైట్లు వెలగడంతో శోబాయమానంగా దర్శనమిస్తోంది. ఇటీవలనే జలాశయానికి గండికోట నుంచి భారీగా నీరు రావడంతో పెన్నా కు విడుదల చేసిన విషయం విదితమే. అయితే అప్పట్లో ఫ్లడ్లైట్లు లేక గేట్ల వద్ద సుందర దృశ్యాలను పర్యాటకులు వీక్షించలేక పోయారు. ఇక సందర్శకులకు అలాంటి సమస్యలుండవు.