ఎలక్ట్రిక్‌ టూవీలర్లు చౌక!

ABN , First Publish Date - 2021-06-13T08:31:24+05:30 IST

దేశంలో విద్యుత్‌ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఫేమ్‌-2 పథకంలో భాగంగా ఎలక్ట్రిక్‌ టూ వీలర్లపై సబ్సిడీని కిలోవాట్‌కు రూ.5,000 చొప్పున పెంచుతూ భారీ

ఎలక్ట్రిక్‌ టూవీలర్లు చౌక!

ఫేమ్‌-2 పథకం సబ్సిడీ పెంచిన ప్రభుత్వం 


న్యూఢిల్లీ: దేశంలో విద్యుత్‌ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఫేమ్‌-2 పథకంలో భాగంగా ఎలక్ట్రిక్‌ టూ వీలర్లపై సబ్సిడీని కిలోవాట్‌కు రూ.5,000 చొప్పున పెంచుతూ భారీ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాంతో ఈ వాహనాలపై సబ్సిడీ రేటు కిలోవాట్‌కు రూ.10,000 నుంచి రూ.15,000కు పెరిగింది. దీంతో దేశంలో తయారయ్యే ఎలక్ట్రిక్‌ టూవీలర్ల రేటు తగ్గనుంది.   వేగంగా వృద్ధి చెందుతున్న దేశీయ ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ కంపెనీ ఎథర్‌ తన ఫ్లాగ్‌షిప్‌ ఈ-స్కూటర్‌ 450 ఎక్స్‌ ధరను రూ.14,500 మేర తగ్గించింది. సబ్సిడీ పెంపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేసిన తొలి కంపెనీ ఇదే. 




స్వాగతించిన పరిశ్రమ వర్గాలు 

ఫేమ్‌-2 పథకంలో ఎలక్ట్రిక్‌ టూవీలర్లపై సబ్సిడీని 50 శాతం పెంచడాన్ని ఇండస్ట్రీ వర్గాలు స్వాగతించాయి. అసాధారణ నిర్ణయంగా అభివర్ణించాయి. దేశంలో విద్యుత్‌ వాహనాల వినియోగం పెరిగేందుకు దోహదపడనుందన్నారు. 

Updated Date - 2021-06-13T08:31:24+05:30 IST