Abn logo
Aug 13 2020 @ 00:25AM

బ్యాటరీ లేకపోయినా విద్యుత్‌ వాహనాల అమ్మకం

న్యూఢిల్లీ: విద్యుత్‌ వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలు ఇక బ్యాటరీలు ఏర్పాటు చేయకుండానే, ఈ వాహనాలను  అమ్మవచ్చు. అధికారులు వాటిని రిజిస్టర్‌ చేయవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో విద్యుత్‌ వాహన కొనుగోలుదారులపై కొంత ఆర్థిక భారం తగ్గనుంది. విద్యుత్‌ వాహనాల కొనుగోలు ధరలో 30-40 శాతం ధర బ్యాటరీలదే. కాకపోతే ఈ వాహనాల భధ్రతకు సంబంధించి టెస్టింగ్‌ ఏజెన్సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ మాత్రం తప్పనిసరి. అలాగే ఈ సర్టిఫికెట్‌ జారీ చేసిన ఏజెన్సీనే ఈ వాహనంలో అమర్చే బ్యాటరీ రెగ్యులర్‌ బ్యాటరీనా ?లేక మార్చదగిన (శ్వాప్‌) బ్యాటరీనా? అనే విషయాన్నీ స్పష్టం చేయాల్సి ఉంటుంది. 


Advertisement
Advertisement
Advertisement