Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యుత ఉద్యోగుల నిరసన

భువనగిరిటౌన, డిసెంబరు 8: కేంద్రం విద్యుత సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని విద్యుత ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. బుధవారం భువనగిరి ట్రాన్సకో డీఈ కార్యాలయంలో ఉద్యోగులు ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం అ మలులోకి తీసుకురానున్న విద్యుత సవరణ చట్టం-2020ను ఉపసంహ రించుకోవాలని డిమాండ్‌ చేశారు. కొత్త చట్టం ద్వారా విద్యుత సంస్థలపై కేంద్రానికి ఆధిపత్యం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితం గా విద్యుత బిల్లులు పెరగడం, ఉద్యోగాల సంఖ్య తగ్గడం తదితర పరిణామాలు నెలకొంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుంటే దేశవ్యాప్తంగా మెరుపు సమ్మె చేస్తామని వారు హె చ్చరించారు. అనంతరం  డీఈ మల్లిఖార్జునకు వినతిపత్రం అందజేశా రు. కార్యక్రమంలో విద్యుత ఉద్యోగుల సంఘాల నాయకులు యాదగిరి, అమర్‌నాధ్‌, మీర్జా, మురళి, ప్రభాకర్‌రావు, షకీల్‌ పాల్గొన్నారు. 


Advertisement
Advertisement