విద్యుత్‌ బిల్లుల భారం ప్రభుత్వమే భరించాలి

ABN , First Publish Date - 2020-05-16T10:59:48+05:30 IST

విద్యుత్‌ బిల్లుల భారం ప్రభుత్వమే భరించాలని పలు పార్టీల, ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని

విద్యుత్‌ బిల్లుల భారం ప్రభుత్వమే భరించాలి

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పార్టీల, ప్రజా సంఘాల నేతలు


కడప (మారుతీనగర్‌), మే 15: విద్యుత్‌ బిల్లుల భారం ప్రభుత్వమే భరించాలని పలు పార్టీల, ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఐ నేతృత్వంలో శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ‘కరోనా కష్టాలు, కరెంటు బిల్లులు.. ప్రజలదే భారం’ అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. సమావేశానికి అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు హాజరై మాట్లాడారు.


కరోనా మహమ్మారి కారణంగా అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి రెండు నెలల కరెంటు బిల్లులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు నిరసనగా ఈ నెల 18న ఏపీఎ్‌సపీడీసీఎల్‌ కార్యాలయం వద్ద నిరసన చేపడతామన్నారు.


కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎం నాయకుడు దస్తగరిరెడ్డి, టీడీపీ నాయకులు పోలుదాసు కృష్ణమూర్తి, జయచంద్ర, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సత్తార్‌, జకరయ్య, సలావుద్దీన్‌, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్‌, ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-16T10:59:48+05:30 IST