విద్యుత్‌ చార్జీలతో ప్రజలపై పెనుభారం

ABN , First Publish Date - 2021-10-19T05:11:16+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను ఇష్టానుసారంగా పెంచి ప్రజలపై పెనుభారం మోపుతుందని తాడేపల్లిగూడెం నియో జకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి వలవల బాబ్జి విమర్శించారు

విద్యుత్‌ చార్జీలతో ప్రజలపై పెనుభారం
అలంపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

పెంటపాడు, అక్టోబరు, 18 : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను ఇష్టానుసారంగా పెంచి ప్రజలపై పెనుభారం మోపుతుందని తాడేపల్లిగూడెం నియో జకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి వలవల బాబ్జి విమర్శించారు. విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం అలంపురం గ్రామం మాజీ సర్పంచ్‌ పెనుమర్తి హరిచంద్రప్రసాద్‌ ఇంటి నుంచి జంక్షన్‌ వరకు ర్యాలీ నిరహించారు. వలవల బాబ్జి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యుత్‌ యూనిట్‌ రూ3.12 లకు లభిస్తుంటే వైసీపీ ప్రభుత్వం కమీషన్ల కోసం ఆశపడి రూ.6 నుంచిరూ. 11 పెట్టి కొనుగోలు చేశారని ఈ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు. సర్పంచ్‌ తాతపూడి ప్రగతి, ఎంపీటీసీ పెనుమర్తి శ్రీదేవి,  టీడీపీ నాయకులు దాసరి కృష్ణవేణి, గొర్రెల శ్రీధర్‌, పాతూరి రాంప్రసాద్‌చౌదరి, కిలపర్తి వెంకట్రావు, బడుగు పెద్ద, గంధం సతీష్‌, పరిమి రవికుమార్‌, బుద్దన ధనరాజు, ముప్పిడి రమేష్‌, చెప్పుల వాసు, దాసరి సతీష్‌కుమార్‌, అంజూరి శ్రీనివాస్‌, పీతల సత్యనారాయణ, పొట్ల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-19T05:11:16+05:30 IST