Abn logo
Oct 22 2021 @ 00:21AM

గడ్డు పరిస్థితుల్లో విద్యుత్‌ సంస్థ

మాట్లాడుతున్న 1104 రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.పద్మారెడ్డి

- 1104 రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.పద్మారెడ్డి


పాలమూరు, అక్టోబరు 21 : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ సంస్థలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ (1104) యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.పద్మారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేం ద్రంలో జరిగిన ముందస్తు సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం, విద్యుత్‌ సంస్థలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని అన్నారు. కార్మికులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలో మొదటిసారి జనరల్‌ కౌన్సిల్‌ నిర్వహిస్తుండటం, ఉమ్మడి జిల్లాలో 1104 యూని యన్‌ బలోపేతం కావటం సంతోషంగా ఉందన్నారు. శుక్రవారం ఉద యం 9గంటలను జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి కార్మికులు భారీ ర్యాలీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు, ఆఫీస్‌ బేరర్లు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. కౌన్సిల్‌కు ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, ట్రాన్స్‌కో సీ.ఎం.డి. డి.ప్రభాకర్‌రావు, ఆపరేషన్‌ సీ.ఎం.డి. జి.రఘుమారెడ్డి, గోపాల్‌రావు హాజరవుతారని తెలిపారు.