పల్లెల్లో నగర జనం.. గ్రేటర్‌లో తగ్గిన విద్యుత్‌ డిమాండ్‌

ABN , First Publish Date - 2022-01-21T15:51:07+05:30 IST

గ్రేటర్‌లో వారం రోజులుగా విద్యుత్‌ డిమాండ్‌ తగ్గింది. సా ధారణంగా గ్రేటర్‌జోన్‌లో రోజూ 50 మిలియన్‌ యూనిట్లకు

పల్లెల్లో నగర జనం.. గ్రేటర్‌లో తగ్గిన విద్యుత్‌ డిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో వారం రోజులుగా విద్యుత్‌ డిమాండ్‌ తగ్గింది. సా ధారణంగా గ్రేటర్‌జోన్‌లో రోజూ 50 మిలియన్‌ యూనిట్లకు పైగా విద్యుత్‌డిమాండ్‌ నమోదవుతుండగా, గత ఆరు రోజులుగా 38-45 మిలియన్‌ యూనిట్లకు పడిపోయింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో గ్రేటర్‌ నుంచి సొంతూళ్లకు లక్షలమంది తరలివెళ్లిడం, కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో ఏసీల వినియోగం తగ్గడంతో ఆ ఎఫెక్ట్‌ విద్యుత్‌డిమాండ్‌పై పడిందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల మొదటివారంలో 50 మిలియన్‌ యూనిట్ల వరకు నమోదయిన విద్యుత్‌ డిమాండ్‌ రెండో వారంలో 45 మిలియన్‌ యూనిట్లకు పడిపోయింది. ఈనెల 16న రికార్డుస్థాయిలో 38.3 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ గ్రేటర్‌లో నమోదైంది.  ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన తక్కువ డిమాండ్‌ ఇదేనని విద్యుత్‌ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-01-21T15:51:07+05:30 IST