హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-12-03T05:07:06+05:30 IST

విద్యుత్‌ శాఖలో అర్హులైన కాంట్రాక్టు కార్మికులకు జేఎల్‌ఎం పోస్టు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా దానిని అమలు చేయకుండా ఎస్‌ఈ విజయ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నేతలు ఆరోపించారు.

హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి
విద్యుత్‌ భవన్‌ ఎదుట రిలే నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులు

విద్యుత్‌ భవన్‌ ఎదుట కార్మికుల రిలే దీక్షలు


నెల్లూరు(జడ్పీ), డిసెంబరు 2 : విద్యుత్‌ శాఖలో అర్హులైన కాంట్రాక్టు కార్మికులకు జేఎల్‌ఎం పోస్టు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా దానిని అమలు చేయకుండా ఎస్‌ఈ విజయ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నేతలు ఆరోపించారు. యూనైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంపాయీస్‌, కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నెల్లూరులోని విద్యుత్‌ భవన్‌ ఎదుట బుధవారం కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. యూఈఈయూ జిల్లా అధ్యక్షకార్యదర్శులు వాసిరెడ్డి సుధాకర్‌రావు, ఎస్‌కే జాకీర్‌హుస్సేన్‌ మాట్లాడుతూ  విద్యుత్‌శాఖలో నిబంధనల మేరకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అలాగే  అక్రమ బదిలీలు, ఉద్యోగోన్నతులను రద్దుచేసి అర్హులకు న్యాయం చేయాలన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు మునికృష్ణయ్య, హరినారాయణ, జయశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

=====================

Updated Date - 2020-12-03T05:07:06+05:30 IST