విద్యుత కనెక్షన్లపై ‘కొత్త’ బాదుడు..!

ABN , First Publish Date - 2022-01-21T05:56:35+05:30 IST

విద్యుత వినియోగదారులపై ఆ శాఖ మోయలేని భారా లు మోపుతోంది. తాజాగా కొత్త బాదుడు బాదుతోంది. విద్యుత నూతన కనెక్షన్లపై డెవల్‌పమెంట్‌ చార్జీల మాటున మరింత భారం మోపుతోంది.

విద్యుత కనెక్షన్లపై ‘కొత్త’ బాదుడు..!

అభివృద్ధి మాటున చార్జీల మోత

నూతన కనెక్షన్ల చార్జీల పెంపు

అనంతపురంరూరల్‌, జనవరి 20: విద్యుత వినియోగదారులపై ఆ శాఖ మోయలేని భారా లు మోపుతోంది. తాజాగా కొత్త బాదుడు బాదుతోంది. విద్యుత నూతన కనెక్షన్లపై డెవల్‌పమెంట్‌ చార్జీల మాటున మరింత భారం మోపుతోంది. ఇటీవల స్లాబులు కుదించి.. యూనిట్‌ ధర పెంచింది. ఈ క్రమంలోనే ఆగస్టు నుంచి ఆ మేరకు వసూలుకు సిద్ధమవుతోంది. ఇది మరువక మందే మరో బాంబు పేల్చింది. అభివృద్ధి చార్జీలను అమాంతం పెంచేసింది. వి ద్యు త పంపిణీ వ్యయాలు, ట్రాన్సఫార్మర్ల ఖర్చులు, కూలీల ధరల పెరుగుదల తదితరాలను చూపి, డెవల్‌పమెంట్‌ చార్జీల పెంపునకు విద్యుత శాఖ ఏపీఈఆర్‌సీ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే గతేడాది 31న ఏపీఈఆర్‌సీ ఇందుకు గ్రీనసిగ్నల్‌ ఇచ్చింది. విద్యుత శాఖ కొత్తగా విద్యుత కనెక్షన పొందాలనుకునే వారి నుంచి నూతన ధరల ప్రకారం వసూలు చేస్తోంది. ఈలెక్కన గృహ కనెక్షనపై కిలో వాట్‌కు రూ.1450 నుంచి రూ.1750కి పెంచింది. వాణిజ్యం, పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్ల ధరలూ పెంచేసింది. ఇలా వినియోగదారులపై డెవల్‌పమెంట్‌ మాటున చార్జీల బాదుడు బాదుతోంది.


గృహకనెక్షనపై కిలోవాట్‌కు రూ.300పెంపు

ప్రస్తుతం గృహ విద్యుత కనెక్షన్ల నుంచి 500 యూనిట్ల వరకూ రూ.500 చొప్పున డెవల్‌పమెంట్‌ చార్జీగా వసూలు చేస్తున్నారు. దీనిని రూ.1000కి పెంచాలని విద్యుత పంపిణీ సంస్థ.. ఈఆర్‌సీకి ప్రతిపాందించింది. ఏపీఈఆర్‌సీ రూ. 800కి ఆమోదం తెలిపింది. అంటే కిలో వాట్‌కు రూ.300 పెంచిందన్నమాట. జిల్లాలో రోజూ పదుల సంఖ్యలో కొత్త కనెక్షన్లకు దరఖాస్తులు విద్యుత శాఖకు వస్తుంటాయి. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు పెరిగిన ధరలకు అనుగుణంగా డబ్బుచెల్లించాలన్నమాట. వాణిజ్య కనెక్షనపై కిలో వాట్‌కు రూ.600, చిన్న పరిశ్రమలకు రూ.800, వ్యవసాయానికి సంబంధించి రూ.300 పెంచింది.


ఈనెల 1 నుంచే అమలులోకి..

పెరిగిన ధరలు ఈనెల 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. అంతకుముందు వరకు దరఖాస్తుదారుల అంచనాలతో కూడిన డిమాండ్‌ నోటీసులోని డబ్బు చెల్లించిన వారికి పాత ధరలే వర్తిస్థాయి. అంచనాలు వేయని, డిమాండ్‌ నోటీసులు జారీచేయని దరఖాస్తులకు కొత్త ధరలు వర్తిస్థాయి. ఆ మేరకు వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది.

నాగరాజు, ఎ్‌సఈ, విద్యుతశాఖ


Updated Date - 2022-01-21T05:56:35+05:30 IST