జెన్‌కోలో ఖాళీలను కాంట్రాక్టు కార్మికులతో భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2021-03-08T09:36:31+05:30 IST

ఏపీ జెన్‌కోలో ఖాళీ పోస్టులను కాంట్రాక్టు కార్మికులతో భర్తీ చేయాలని తెలుగునాడు విద్యుత్‌ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పర్వతనేని సాంబశివరావు డిమాండ్‌

జెన్‌కోలో ఖాళీలను కాంట్రాక్టు కార్మికులతో భర్తీ చేయాలి

తెలుగునాడు విద్యుత్‌ కార్మిక సంఘం అధ్యక్షుడు సాంబశివరావు


ఇబ్రహీంపట్నం, మార్చి 7: ఏపీ జెన్‌కోలో ఖాళీ పోస్టులను కాంట్రాక్టు కార్మికులతో భర్తీ చేయాలని తెలుగునాడు విద్యుత్‌ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పర్వతనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. తెలుగునాడు విద్యుత్‌ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏ కాలనీ ప్రాంతీయ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. ప్రాంతీయ అధ్యక్షుడు ఆలపాటి శివనాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో సాంబశివరావు మాట్లాడుతూ ఎలక్ట్రీసిటీ యాక్ట్‌ 2020 ద్వారా డిస్కమ్స్‌లను నిర్వర్యం చేసేందుకుకు కుట్రలు చేస్తున్నారని, వాటిని అమలు చేయకుండా చూడాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-03-08T09:36:31+05:30 IST