రోజుకు 20 సార్లు కరెంట్‌ కట్‌

ABN , First Publish Date - 2021-05-08T05:02:29+05:30 IST

మద్దికెర గ్రామంలో విద్యుత్‌ కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

రోజుకు 20 సార్లు కరెంట్‌ కట్‌
మద్దికెర విద్యుత్‌ సబ్‌స్టేషన్‌

మద్దికెర, మే 7: మద్దికెర గ్రామంలో విద్యుత్‌ కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కరెంట్‌ ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో? అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు. ఈ గ్రామంలో 4వేలకు పైగా విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. గ్రామంలో ఎక్కడ కరెంట్‌ పోయినా ఎల్‌సీల పేరుతో సబ్‌స్టేషన్‌లో గంటలు తరబడి తొలగిస్తున్నారని ప్రజలు అంటున్నారు. గ్రామంలోని ఊరివాకిలి, ఎస్సీ కాలనీలో లో వోల్టేజీ ప్రభావం వల్ల కనెక్షన్లు కూడా తొలిగిపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రోజుకు కనీసం 20 సార్లు అయినా కరెంట్‌ తీస్తుంటారని ప్రజలు మండిపడుతున్నారు. కనీసం సమాధానం కూడా చెప్పే వారు కరువయ్యారని అంటున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్‌ కోతలను విధిస్తుండడం వల్ల నీటి సమస్య తెలెత్తుందోని ప్రజలు వాపోతున్నారు. గత వారం రోజుల నుంచి విద్యుత్‌ కోతలు అధికమయ్యాయని, రాత్రివేళల్లో కూడా కరెంట్‌ తొలగిస్తున్నారని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్‌ అధికారులు స్పందించి విద్యుత్‌ కోతలు లేకుండా కరెంట్‌ను అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయంపై లైన్‌మన్‌ రామాంజనేయులు మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మ్మర్ల మీద అధిక లోడ్‌ పడడం వల్ల కనెక్షన్‌ ఎగిరిపో తోందని, అందువల్ల విద్యుత్‌ సమస్య ఏర్పడుతుందని తెలిపారు.

Updated Date - 2021-05-08T05:02:29+05:30 IST