కరోనాను అంతం చేసే సరికొత్త మాస్క్

ABN , First Publish Date - 2020-08-15T07:32:36+05:30 IST

కరోనా వైర్‌సను ఎదుర్కొనేందుకు జాదవ్‌పూర్‌ వర్సిటీ విద్యార్థులు ఓ ఎలకా్ట్రనిక్‌ మాస్కును తయారు చేశారు. ఇది తన చుట్టూ ఓ విద్యుదయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుందని, దీన్ని ధరించిన వ్యక్తి సమీపంలోకి వచ్చే కరోనా సహా...

కరోనాను అంతం చేసే సరికొత్త మాస్క్

కోల్‌కతా, ఆగస్టు 14: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు జాదవ్‌పూర్‌ వర్సిటీ విద్యార్థులు ఓ ఎలక్ట్రానిక్‌ మాస్కును తయారు చేశారు. ఇది తన చుట్టూ ఓ విద్యుదయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుందని, దీన్ని ధరించిన వ్యక్తి సమీపంలోకి వచ్చే కరోనా సహా ఎలాంటి వైరస్నైనా ఇది అంతం చేస్తుందని వర్సిటీ అధికారులు తెలిపారు. ‘ఈ ఎలక్ట్రానిక్‌ మాస్కు డిజైన్‌ సిద్ధంగా ఉంది. అనుమతి కోసం ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేశాం’ అని జాదవ్‌పూర్‌ వర్సిటీ సహాయ ఉప కులపతి చిరన్‌జిబ్‌ భట్టాచార్యా తెలిపారు. 


Updated Date - 2020-08-15T07:32:36+05:30 IST