స్నేహమంటే ఇదేరా.. ఏనుగు పిల్ల వీడియో వైరల్‌!

ABN , First Publish Date - 2020-11-28T20:23:20+05:30 IST

ప్రతి ఫ్రెండూ అవసరమేరా.. అంటూ మనం ఎక్కువగా స్నేహితులతోనే సమయం గడుపుతాం. చిన్నప్పుడు కోతి కొమ్మచ్చి ఆడే సమయం నుంచి పెద్దయ్యాక ప్రేమ ప్రయత్నాల్లో మునిగే వరకూ పక్కన ఫ్రెండ్ లేకపోతే ఆ వెలితి మామూలుగా ఉండదు.

స్నేహమంటే ఇదేరా.. ఏనుగు పిల్ల వీడియో వైరల్‌!

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఫ్రెండూ అవసరమేరా.. అంటూ మనం ఎక్కువగా స్నేహితులతోనే సమయం గడుపుతాం. చిన్నప్పుడు కోతి కొమ్మచ్చి ఆడే సమయం నుంచి పెద్దయ్యాక ప్రేమ ప్రయత్నాల్లో మునిగే  వరకూ పక్కన ఫ్రెండ్ లేకపోతే ఆ వెలితి మామూలుగా ఉండదు. ఇదిగో ఈ బుజ్జి ఏనుగు పిల్లకు కూడా అలాగే ఓ మిత్రుడు కావాలని అనిపించింది. జాతి, సైజులు పక్కన పెట్టేసి ఎవరితోనైనా స్నేహం చేయడానికి రెడీ అయిపోయింది. అప్పుడే దానికో శునకం కనిపించింది. అంతే దాంతో స్నేహం చేసి, ఆటలాడుతోంది. ప్రస్తుతం ఇవి ఆడుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


వీడియోలోని ఈ గున్న ఏనుగు పేరు యిండీ, కుక్కపిల్ల పేరు మిలో. ఈ రెండూ కూడా మంచి ఫ్రెండ్స్. థాయ్‌ల్యాండ్‌లోని ఎలిఫెంట్ నేచర్ పార్క్‌లో ఈ రెండు మూగజీవులు ఉంటున్నాయి. ఇక్కడే వీటి మధ్య స్నేహం చిగురించింది. ప్రతిరోజూ ఈ రెండూ ఆడుకుంటూ సరదాగా గడుపుతుంటాయి. ఈ వీడియోలో మిలో వెళ్లి యిండీ చుట్టూ రౌండ్లు కొట్టింది. దీంతో దాన్ని పట్టుకోవడానికి యిండీ నానా ప్రయత్నాలూ చేస్తూ వెంటపడింది. దీన్ని చూసిన నెటిజన్లు ఈ రెండూ ముద్దొచ్చేస్తున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు. కానీ ఈ వీడియో చాలా పాతదట. 



2015లో ఈ వీడియ తీశారు. మళ్లీ ఇప్పుడు దీన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద దీన్ని రీట్వీట్ చేశారు. గురువారం ఆయన ఈ వీడియో అలా పోస్ట్ చేశాడో లేదో ఇది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ‘‘స్నేహితులు అన్ని రకాల సైజులు, ఆకారాల్లో వస్తారు’’ అంటూ దీనికి క్యాప్షన్ పెట్టాడు నంద. ఎలిపెంట్ నేచర్ పార్కులో దెబ్బతిన్న ఏనుగులకు చికిత్స చేసి, అవి హాయిగా జీవించడానికి కావలసిన పరిస్థితులు సృష్టిస్తారు. ఇలానే యిండీ వీరి వద్దకు చేరిందట.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యిండీ తల్లిని రోడ్లపై తిప్పుతూ అడుక్కునే వారట. ఇటువంటి తరుణంలో ఆ ఏనుగును ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యిండీ తల్లి తీవ్రంగా గాయపడింది. అప్పటికే ఆ ఏనుగు కడుపులో యిండీ ఉంది. 2013లో ఈ ఘటన జరిగినప్పుడు దెబ్బతిన్న ఏనుగుకు ఎలిఫెంట్ నేచర్ పార్క్ సిబ్బంది చికిత్స చేశారు. ఆ సమయంలోనే యిండీకి జన్మనిచ్చిన సదరు ఏనుగు కన్నుమూసింది. ఆ తర్వాత యిండీ కళ్లు తెరిచింది. ఇక్కడ పెరుగుతున్నప్పుడే యిండీ, మిలో ఒకదాన్నొకటి కలిశాయి. యిండీ తన వెంటపడేలా చేసుకొని పరిగెత్తడం అంటే మిలోకు చాలా ఇష్టమట.



Updated Date - 2020-11-28T20:23:20+05:30 IST