Abn logo
Aug 27 2021 @ 12:37PM

చిత్తూరు జిల్లా: ఏనుగు హల్ చల్

చిత్తూరు జిల్లా: పలమనేరు మండలం, ముసలమడుగు గ్రామం, గుడియాత్తం జాతీయ రహదారిపై ఏనుగు హల్ చల్ చేసింది. దాదాపు రెండున్నర గంటలపాటు రోడ్డుపై పచార్లు చేసింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై ఏనుగు హూంకరిస్తూ.. అటూ ఇటూ తిరగడంతో ప్రయాణీకులు భయభ్రాంతులకు గురయ్యారు. సోలార్ కంచె దాటలేక నానా యాతనపడింది. దీంతో అటవీ సిబ్బంది సోలార్ కంచె తొలగించి ఏనుగును అడవిలోకి వెళ్లేలా చేయడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.