పుత్తూరులో ఏనుగుల హల్‌చల్

ABN , First Publish Date - 2021-01-17T15:57:15+05:30 IST

పుత్తూరు మండలంలోని ఎగువ గూళూరులో ఏనుగుల గుంపు హల్‌చల్ చేశాయి.

పుత్తూరులో ఏనుగుల హల్‌చల్

చిత్తూరు: జిల్లాలోని పుత్తూరు మండలంలోని ఎగువ గూళూరులో ఏనుగుల గుంపు హల్‌చల్ చేశాయి. ఏనుగుల గుంపుతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంటలు ధ్వంసం చేస్తుడడంతో ఆందోళన చెందుతున్నారు. గజరాజులు ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తాయో తెలియక స్థానికులు భయపడిపోతున్నారు. పోలీస్, అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. బాంబులు పేలుస్తూ, డప్పులు వాయిస్తూ ఏనుగులను తరిమికొట్టేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. 

Updated Date - 2021-01-17T15:57:15+05:30 IST