ఏలేరు నిండింది!

ABN , First Publish Date - 2021-10-12T06:51:58+05:30 IST

ఏలేశ్వరం, అక్టోబరు 11: ఏలేరు పరీవాహక ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా రిజర్వాయర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నీటి నిల్వలు పూర్తిగా గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ప్రాజెక్టు నుంచి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మిగులు జలాలను విడుదల కొనసాగిస్తున్నారు. సోమ

ఏలేరు నిండింది!
ఏలేరు రిజర్వాయర్‌

ప్రమాదకర స్థాయికి చేరుకున్న నీటి నిల్వలు.. 

దిగువకు మిగులు జలాల విడుదల 

ఏలేశ్వరం, అక్టోబరు 11: ఏలేరు పరీవాహక ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా రిజర్వాయర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నీటి నిల్వలు పూర్తిగా గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ప్రాజెక్టు నుంచి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మిగులు జలాలను విడుదల కొనసాగిస్తున్నారు. సోమవారం తూర్పు, విశాఖ ఏజెన్సీ కొండల ప్రాంతాల నుంచి 3300 క్యూసెక్కుల వరద నీరొచ్చి చేరింది. దీంతో 86.56 మీటర్ల స్థాయిలో 24.11 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీటి నిల్వలు 84.25 మీటర్ల స్థాయిలో 19.59 టీఎంసీలకు చేరుకున్నాయి. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి వరద ప్రవాహ ఉధృతి కొనసాగుతుండడంతో స్పిల్‌వే రెగ్యులేటర్‌ విభాగం వద్ద క్రస్ట్‌ గేట్‌ను పైకి ఎత్తిన అధికారులు దిగు వకు 200 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేశారు. నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరడంతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు వద్ద నీటిమట్టాన్ని 86 మీటర్ల స్థాయి వరకు ఉంచి, ఆపై ఎప్పటికప్పుడు మిగులు జలాలను దిగువకు విడిచిపెట్టేలా అధికారులు కార్యాచరణ చేపట్టారు. డీసీఆర్‌ స్లూయీజ్‌, స్పిల్‌వే రెగ్యులేటర్‌ విభాగాల ద్వారా మొత్తం 800 క్యూసెక్కులు, విశాఖ నగరానికి 60 క్యూసెక్కుల వంతున రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదల చేపట్టారు. అదనపు జలాలు విడుదల వల్ల గత ఏడాది మాదిరిగా దిగువన ఉన్న కిర్లంపూడి, గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి తదితర మండలాల్లో పంట పొలాలతోపాటు పలు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండడంతో జాగ్రత్తలు చేపట్టారు.

Updated Date - 2021-10-12T06:51:58+05:30 IST