పేకాట, సారా స్థావరాలపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2021-06-23T04:40:57+05:30 IST

ఏలేశ్వరం, జూన్‌ 22: మండలంలో పేకాట, సారా తయారీ స్థావరాలపై ఎస్‌ఐ సీహెచ్‌.విద్యాసాగర్‌ నేతృతంలో సిబ్బంది మంగళవారం దాడులు నిర్వహించారు. పట్టణ శివారు మం దుల కాలనీ, ములగలమెట్ట కాలనీల వద్ద నిర్వహిస్తున్న పేకాట కేంద్రాలపై దాడులు జరిపి ఎనిమిది మంది

పేకాట, సారా స్థావరాలపై పోలీసుల దాడి

తొమ్మిదిమందిపై కేసు 

ఏలేశ్వరం, జూన్‌ 22: మండలంలో పేకాట, సారా తయారీ స్థావరాలపై ఎస్‌ఐ సీహెచ్‌.విద్యాసాగర్‌ నేతృతంలో సిబ్బంది మంగళవారం దాడులు నిర్వహించారు. పట్టణ శివారు మం దుల కాలనీ, ములగలమెట్ట కాలనీల వద్ద నిర్వహిస్తున్న పేకాట కేంద్రాలపై దాడులు జరిపి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.9460 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. లింగంపర్తి పంచాయతీ ఽశివారు కొండతిమ్మాపురం గ్రామానికి వెళ్లే రహదారిలో బైక్‌పై సారా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. 40లీటర్ల సారాతోపాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. 

Updated Date - 2021-06-23T04:40:57+05:30 IST