వివాదంగా మారిన ఆక్రమణల తొలగింపు

ABN , First Publish Date - 2021-06-20T06:15:06+05:30 IST

పట్టణంలోని మెయినరోడ్డు విస్తరణ పనులలో భాగంగా అధికారులు శనివారం నామాలాడ్జి వద్ద ఉన్న ఏటీఎంను య జమానికి తెలియకుండానే ఎటువంటి నోటీసు ఇవ్వకుండా కూలదోశారు.

వివాదంగా మారిన ఆక్రమణల తొలగింపు

నోటీసులు ఇవ్వకుండా పనులు చేపట్టిన అధికారులు

ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కందికుంట

కదిరి , జూన 19 : పట్టణంలోని మెయినరోడ్డు విస్తరణ పనులలో భాగంగా అధికారులు శనివారం నామాలాడ్జి వద్ద ఉన్న ఏటీఎంను య జమానికి తెలియకుండానే ఎటువంటి నోటీసు ఇవ్వకుండా కూలదోశారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అక్కడకు చేరుకుని మున్సిపల్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలలోకి వెళ్ళితే మెయినరోడ్డు విస్తరించడానికి గత సంవత్సర కాలం గా సర్వేలు కొనసాగుతున్నాయి. అయితే శనివారం మధ్యాహ్నం ఉన్న ఫలానా మున్సిపల్‌ టౌనప్లానింగ్‌ అధికారి రహిమాన తన సిబ్బందితో పాటు పోలీసులను కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు తీసుకొ చ్చారు. ఆ వెంటనే జేసీబీతో ప్రభుత్వ ఆసుపత్రి గోడను కూలగొట్టారు. పక్కనే ఉన్న నామాలాడ్జి గోడను కూడా పగులకొట్టేశారు. దీని పై లాడ్జి యజమాని రాఘవ మాట్లాడుతూ తనకు తెలియకుండా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా గోడను కూలగొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రో డ్డు వేస్తామంటే స్వచ్ఛందంగా తొలగించుకుంటామని, పలుమార్లు ము న్సిపల్‌ అధికారులకు చెప్పినట్లు బాధితుడు తెలిపారు. మూడుసార్లు మార్కింగ్‌ వేశారని, ఎక్కడికి తొలగించుకోవాలో తెలియక తికమకపడు తున్నామన్నారు. ఇదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ కల్పించుకుని 60 అడుగులకు రోడ్డు మార్కింగ్‌ ఇవ్వాలని ఇదివరకే స్పష్టం చేశామన్నారు. మున్సిపల్‌ అధికారులతో శనివారం కూడా ఇదే విషయాన్ని చెప్పామన్నారు. మార్కింగ్‌ ఇచ్చిన తర్వాత రోడ్డు వేయండి అని చెప్పామన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాము కూడా సహకరిస్తామని వివరించినట్లు తెలిపారు. ఈ లోపే మున్సిపల్‌ అధికారులు అత్యుత్సాహం చూపి ప్రభుత్వ ఆస్తితో పాటు ప్రైవేటు ఆస్తిని కూడా కూలగొట్టడం ఏమిటని ప్రశ్నించారు. పద్ధతి ప్రకారం చేస్తే ఎవరికి ఇబ్బందులు ఉండవన్నారు. 60 అడుగుల రోడ్డుకు తాము అంద రూ సహకరిస్తామని పదే పదే చెబుతున్నా.. మున్సిపల్‌ అధికారులు పెడచెవిన పెడుతున్నారని ఆరోపించారు. గతంలో కూడా కమ్యూనిటీ భవనాన్ని కూలదోసేందుకు ఇదే మున్సిపల్‌ అధికారులు అత్యుత్సాహం చూపారని గుర్తు చేశారు. ఇప్పటికైనా 60 అడుగుల రోడ్డు మార్కింగ్‌ వేసి, రోడ్డు వేస్తే తాము అందరూ సహకరిస్తామని చెప్పారు. ఈ కార్య క్రమంలో ఆయనతో పాటు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మోపూరిశెట్టి చం ద్రశేఖర్‌, సీపీఐ నాయకులు వేమయ్యయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-20T06:15:06+05:30 IST