పక్షుల ఆకలిదప్పులు తీరుస్తున్న ఎల్లుట్ల యువత

ABN , First Publish Date - 2021-05-10T06:05:25+05:30 IST

మండలంలోని ఎల్లుట్ల గ్రామ యువకులు వినూ త్నంగా ఆలోచించారు. మండుతున్న వేసవిలో తినడానికి తిండి, తాగడాని కి గుక్కెడు నీరు లేక మలమలమాడుతున్న పక్షుల ఆకలి దప్పులు తీర్చా లని సంకల్పించారు.

పక్షుల ఆకలిదప్పులు తీరుస్తున్న  ఎల్లుట్ల యువత
చెట్లకు వేలాడదీసిన డబ్బాల్లో నీరు, ఆహారం నింపుతున్న యువకులు



  ఆదర్శంగా నిలిచిన పక్షి ప్రేమికుల బృందం

పుట్లూరు, మే 9: మండలంలోని ఎల్లుట్ల గ్రామ యువకులు వినూ త్నంగా ఆలోచించారు. మండుతున్న వేసవిలో తినడానికి తిండి, తాగడాని కి గుక్కెడు నీరు లేక మలమలమాడుతున్న పక్షుల ఆకలి దప్పులు తీర్చా లని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఇందుకోసం ప్రత్యేకంగా పెద్ద డబ్బాలను తయారు చేయించారు. అందులో కింది భాగంలో నీరు, పైభా గంలో గింజలు నిల్వ ఉండేలా సొంత ఖర్చులతో ఏర్పాట్లు చేశారు. ఎల్లుట్లకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మడ్డిపల్లి అటవీప్రాంతాన్ని ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. డబ్బాలను అడవుల్లోని పెద్దపెద్ద చెట్ల వద్దకు తీ సుకెళ్లి అమర్చి వేలాడదీశారు. దాదాపు 48 డబ్బాలను అక్కడక్కడా చెట్లకు బిగించారు. వాటిలో నీరు, గింజలు నింపుతున్నారు. ప్రతి మూడు రోజుల కు ఒకసారి అటవీ ప్రాంతానికి వెళ్లి నిత్యం వేలాడదీసిన డబ్బాలను పరిశీలించి నీళ్లు, ఆహారం అందిస్తున్నారు. మండు వేసవిలో పక్షుల దాహార్తిని తీరుస్తున్న ఎల్లుట్ల గ్రామ యువకులైన పవన్‌, గంగరాజు, నవీణ్‌, రణదీప్‌, రాజశేఖర్‌, రాజు, అరుణ్‌కుమార్‌, హరి, శ్యామ్‌ మిత్ర బృందం చేస్తున్న సా మాజిక సేవను చూసి గ్రామస్థులు శభాష్‌ అంటున్నారు.

  ఆధునిక జీవనంలో ప్రస్తుత కాలం యువత సమయం దొరికితే స్మార్ట్‌ఫోనులో గేమ్స్‌, సినిమాలు అంటూ జీవితాన్ని బిజీబిజీగా గడిపేస్తుంటారు. కానీ ఎల్లుట్ల గ్రామ యువకులు మాత్రం వేసవికాలంలో పశుపక్ష్యాదుల పట్ల చూపుతున్న ప్రేమ అందరికీ ఆదర్శమైంది.  

Updated Date - 2021-05-10T06:05:25+05:30 IST