కువైట్‌లోని భారతీయులకు ఐడీఎఫ్ ప్రెసిడెంట్ కీలక సూచన!

ABN , First Publish Date - 2021-04-08T21:05:02+05:30 IST

హెల్త్ వర్కర్లపై కువైట్‌లోని భారత అంబాసిడర్ సిబి జార్జ్ ప్రశంసలు కురింపించారు. కొవిడ్ మహమ్మారి విలయం సృష్టిస్తున్న సమయంలో హెల్త్ వర్కర్లు.. నిస్వార్థంగా సేవలు చేస్తూ ఎంతో మంది ప్రాణాలను రక్షిం

కువైట్‌లోని భారతీయులకు ఐడీఎఫ్ ప్రెసిడెంట్ కీలక సూచన!

కువైట్ సిటీ: హెల్త్ వర్కర్లపై కువైట్‌లోని భారత అంబాసిడర్ సిబి జార్జ్ ప్రశంసలు కురింపించారు. కొవిడ్ మహమ్మారి విలయం సృష్టిస్తున్న సమయంలో హెల్త్ వర్కర్లు.. నిస్వార్థంగా సేవలు చేస్తూ ఎంతో మంది ప్రాణాలను రక్షించారని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో భారత్‌లో తయారైన కోవాక్సిన్ టీకాపై ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నిపుణలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సిబి జార్జ్ మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో హెల్త్ వర్కర్లు చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివన్నారు. అంతేకాకుండా హెల్త్ వర్కర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇండియాలో ఫార్మా రంగం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని సిబి జార్జ్ వ్యాఖ్యానించారు. కువైట్‌లోని ఇన్వెస్టర్‌లు ఫార్మా రంగంలో పెట్టుపడి పెట్టాలని పిలుపునిచ్చారు. 



కువైట్‌లోని ఫార్మా రంగం.. భారత్‌లో ఉత్పత్తైన వాటిని ఉపయోగించడానికి కసరత్తు ప్రారంభించాలని కోరారు. కువైట్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అహ్మద్ తువేని మాట్లాడుతూ.. కువైట్‌లోని ఆసుపత్రుల్లో పని చేస్తున్న భారతీయ హెల్త్ వర్కర్లకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా టీకా అభివృద్ధి చేసి.. మహమ్మారిపై పోరాడే విధంగా చేసిన భారత ఫార్మా ప్రపంచానికి కృతజ్ఞతలు చెప్పారు. ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ (ఐడీఎఫ్) అధ్యక్షుడు డాక్టర్ అమీర్ అహమ్మద్ ప్రసంగిస్తూ.. కువైట్‌లోని భారతీయులందరూ వ్యాక్సినేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. కోవ్యాక్సిన్ టీకాను అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన భారత్ బయోటెక్ ప్రతినిధి మాట్లాడుతూ.. క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ముఖ్యంశాలను వెల్లడించారు. 


Updated Date - 2021-04-08T21:05:02+05:30 IST