పచ్చచిక్కదనం

ABN , First Publish Date - 2022-01-20T06:35:54+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లా లో అటవీ విస్తీర్ణం పెరిగింది. అడవుల అభివృద్ధికి అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ మేరకు ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (ఐఎస్‌ఎఫ్‌) రూ పొం దించిన నివేదికలో పలు విషయాలు వెల్లడ య్యాయి.

పచ్చచిక్కదనం
దేవరకొండ డివిజన్‌లో విస్తరించిన అటవీ ప్రాంతం

ఫలితాన్నిచ్చిన హరితహారం

ఉమ్మడి జిల్లాలో 14,915 హెక్టార్లలో పెరిగిన అటవీ సంపద



(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ): ఉమ్మడి నల్లగొండ జిల్లా లో అటవీ విస్తీర్ణం పెరిగింది. అడవుల అభివృద్ధికి అటవీశాఖ చేపడుతున్న చర్య లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ మేరకు ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (ఐఎస్‌ఎఫ్‌) రూపొం దించిన నివేదికలో పలు విషయాలు వెల్లడ య్యాయి. 2019లో ఉమ్మడి నల్లగొండ జిల్లా అటవీ విస్తీర్ణం 1,12,008 హెక్టార్లు కాగా,అది 2021 నాటికి 1,26,923 హెక్టార్లకు పెరిగింది. రెండేళ్లకు ఒకసారి రూపొందించే ఈ నివేదిక ప్రకారం గత రెండేళ్ల కాలంలో అదనంగా 14, 915 హెక్టార్ల మేరకు పచ్చదనం విస్తరించింది. 


సగటు విస్తీర్ణంకంటే తక్కువగా అటవీ ప్రాంతం కలిగిన జిల్లాగా ఉమ్మ డి నల్లగొండ ముద్రవేసుకుంది. హైదరాబాద్‌కు సమీపంలో ఉండడం, నగర సంస్కృతి, వ్యవసాయ సాగు పద్ధతులు, నీటి వసతి అందుబాటులోకి రావడంతో అటవీప్రాంతం క్రమంగా కనుమరుగవుతూ వస్తోంది. ఇది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రమాద గంటికలను మోగించింది. ఉష్ణోగ్రతలు పెరగ డం, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలైంది. నాగార్జునసాగర్‌ డివిజన్‌ మినహా మరెక్కడా ఉమ్మడి జిల్లాలో అటవీ ఛాయలు లేకుండా పోయాయి. కనీసం చిట్టడవులు కూడా కనుమరుగయ్యాయి. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో పోడు వ్యవసాయం పెరగడంతో అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. అయితే రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అడవుల పెంపకాన్ని ప్రధాన కార్యక్రమంగా తీసుకోవడం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధు లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ స్వయంగా హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఒకేరోజు లక్షలాది మొక్కలను  నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లాలో పచ్చదనం పెంచేందుకు ఊతమిచ్చారు. అడవులు చదును చేసి సాగు భూములుగా మార్చుకునే పద్ధతిని అటవీశాఖ నిలిపివేసింది. ఇందుకు ప్రతీ కంపార్టుమెం ట్‌ పరిఽధిలో బేస్‌క్యాం్‌పలు ఏర్పాటు చేసింది. అటవీశాఖ సిబ్బంది సంఖ్యను పెంచింది. నర్సరీల ద్వారా మైదాన ప్రాంతాల్లో అడవులను పెంచింది. హరితహారంలో భాగంగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారితో పాటు పం చాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రోడ్ల వెంట ఎవె న్యూ ప్లాంటేషన్‌ పేరిట మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ప్రారంభించారు. ఇందుకు ఉపాధి హామీ నిధులు పెద్దఎత్తున ఉపయోగంలోకి వచ్చాయి. వీటి సంరక్షణకు ట్రీగార్డులు,నీటి వస తి వంటి పనులు చేపట్టారు. అన్ని రకాల చర్యలు చేపట్టడంతో ఇందులో 90శాతం వరకు సంరక్షించబడి అటవీ విస్తీర్ణం పెరిగింది. ఉపాధి హామీ పథ కం ద్వారా టేకు, నల్లమద్ది, ఉసిరి, వెలగ, కానుగ, వేప మొక్కలు నాటించారు.


రెండేళ్లలో 14.915 హెక్టార్ల మేర పెరిగిన పచ్చదనం

2019లో ఉమ్మడి జిల్లాలో దట్టమైన అడవుల విస్తీర్ణం చూస్తే సున్నా కాగా, మధ్యస్తంగా విస్తరించిన అడవుల శాతం 2,225 హెక్టార్లు. మైదాన ప్రాంతం విషయానికి వస్తే 39,219 హెక్టార్ల మేర విస్తరించి ఉండేది. స్ర్కాబ్‌ (3 నుంచి 4 మీటర్ల మేర చిన్నాచితక) పచ్చదనం విస్తరించిన ప్రాంతం 70,864 హెక్టార్లు. మొత్తంగా ఆ ఏడాది పచ్చదనం చూస్తే 1,12,008 హెక్టార్ల మేర విస్తరించి ఉంది. ఇక రెండేళ్ల తర్వాత 2021 గణాంకాలు చూస్తే దట్టమైన అటవీ విస్తీర్ణం రెండేళ్ల కాలంలో సున్నా నుంచి 15 హెక్టార్ల మేరకు పెరిగింది. ఇక మధ్యస్తంగా విస్తరించిన అడవుల విస్తీర్ణం చూస్తే 2,311 హెక్టార్లకు మైదాన ప్రాంతాల్లో 49,493 హెక్టార్లకు స్ర్కాబ్‌ పెరుగుదల చూస్తే 75,104 హెక్టార్లకు చేరింది. మొత్తంగా చూస్తే 1,26,923 హెక్టార్ల మేరకు ఉమ్మడి జిల్లాలో 2021లో పచ్చదనం పరుచుకుంది. 


పలు కార్యక్రమాలతో పెరిగిన విస్తీర్ణం : సర్వేశ్వర్‌, నాగార్జునసాగర్‌, ఫారెస్టు డివిజన్‌ అధికారి 

అడవుల లోపల, బయట చేపట్టిన కార్యక్రమాల తో పచ్చదనం పెరిగింది. దట్టమైన, మధ్యస్థ అటవీ ప్రాంతంలో (ఎఫారెస్టేషన్‌) అంతరించిపోయిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలను నాటి సంరక్షించాం. ఇందుకు కేంద్ర, రాష్ట్ర నిధులు అందుబాటులోకి వచ్చాయి. అడవి బయట మైదానం ప్రాంతంలో ప్రతీ ఊరి బయట రోడ్డు ఎవెన్యూ ప్లాంటేషన్‌ పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, మంకీఫుడ్‌కో ర్టు, మియావాకి అడవులు ఇలాంటి కార్యక్రమాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా లో వేగంగా నిర్వహించడంతో పచ్చదనం పెరిగింది. హైవేల వెంట మొక్కల ను కాపాడేందుకు అటవీశాఖ సిబ్బందిని, నిధులను కేటాయించింది. 


అడవులు విస్తీర్ణం (హెక్టార్లలో)

2019లో 2021లో

దట్టమైన అడవులు 0 15

మధ్యస్త అడవులు 2,225 2,311

మైదాన ప్రాంతం 41,144 49,493

స్ర్కాబ్‌(చిన్న అడవి) 70,864 75,104

మొత్తం         1,12,008 1,26,923

Updated Date - 2022-01-20T06:35:54+05:30 IST