మరిన్ని రంగాలకు ‘హామీ’ రుణాలు

ABN , First Publish Date - 2021-05-31T06:38:05+05:30 IST

అత్యవసర పరపతి హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) పరిధిని ప్రభుత్వ మరింత విస్తరించింది. కొత్తగా ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్‌లు, విమానయానం, హాస్పిటాలిటీ, పర్యాటక రంగాలకూ విస్తరించింది. ఆర్థిక మంత్రి

మరిన్ని రంగాలకు ‘హామీ’ రుణాలు

జాబితాలో ఏవియేషన్‌, పర్యాటకం, హాస్పిటల్స్‌ 

మరో మూడు నెలల వరకు పథకం

ఇంకా మిగిలింది రూ.45,000 కోట్లే


న్యూఢిల్లీ: అత్యవసర పరపతి హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) పరిధిని ప్రభుత్వ మరింత విస్తరించింది. కొత్తగా ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్‌లు, విమానయానం, హాస్పిటాలిటీ, పర్యాటక రంగాలకూ విస్తరించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రుణాల కోసం రుణ గ్రహీతలు ఎలాంటి పూచీ చూపించాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వమే ఈ రుణాల చెల్లింపునకు పూచీ ఇస్తుంది. కొవిడ్‌ రెండో ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్‌లు, మెడికల్‌ కాలేజీల ఆవరణల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రూ.2 కోట్ల వరకు ఈ పథకం కింద రుణాలు ఇస్తారు.


గడువు పొడిగింపు: ఈసీఎల్‌జీఎస్‌ 4.0 పేరుతో ఈ పథకం గడువును ప్రభుత్వం జూన్‌ నెలాఖరు నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు పొడిగించింది. అయితే ఈ పథకం కింద కేటాయించిన రూ.3 లక్షల కోట్ల రుణ మంజూరు పూర్తయితే ఈ లోపే పథకాన్ని ముగిస్తారు. రుణాల పంపిణీ గడువునూ ఈ ఏడాది చివరి వరకు పొడిగించారు. ఈ నెల 5న ఆర్‌బీఐ జారీ చేసిన మార్గదర్శకాకు లోబడి బ్యాంకులు అర్హులైన రుణగ్రహీతలకు ఈ రుణాలు మంజూరు చే స్తాయి. బ్యాంకులు ఈ రుణాలపై 7.5 శాతానికి మించి వడ్డీ వసూలు చేయకూడదు. 


అర్హత సడలింపు: తాజా ఈసీఎల్‌జీఎస్‌ కింద రుణ అర్హత నిబంధనలనూ ప్రభుత్వం సడలించింది. ఇంతకు ముందు కనీసం రూ.500 కోట్ల రుణ బకాయిలు ఉన్న సంస్థలకే ఈ పథకాన్ని వర్తింపచేశారు. ఇప్పుడు ఈ పరిమితిని ఎత్తివేసి మొత్తం రుణ బకాయిల్లో 40 శాతం లేదా రూ.200 కోట్లు ఏది తక్కువైతే దాన్ని అర్హతగా నిర్ణయించారు. కొవిడ్‌ రెండో ఉధృతితో తీవ్రంగా దెబ్బతిన్న ఎంఎ్‌సఎంఈ రంగాల్ని ఆదుకునేందుకు ఈ చర్యలు తోడ్పడతాయని ప్రభుత్వం పేర్కొంది. 


రూ.45,000 కోట్లే మిగిలాయ్‌..: గత ఏడాది ప్రకటించిన రూ.3 లక్షల కోట్ల ఈసీఎల్‌జీఎస్‌ పథకం కింద ఇంకా రూ.45,000 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని బ్యాంకులు తెలిపాయి. ఇప్పటి వరకు మంజూరు చేసిన రూ.2.54 లక్షల కోట్ల రుణాల్లో రూ.2.40 లక్షల కోట్లను ఆయా సంస్థలకు పంపిణీ చేసినట్టు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) సీఈఓ సునీల్‌ మెహతా చెప్పారు. 


రూ.25 కోట్ల లోపు రుణాల పునర్‌ వ్యవస్థీకరణ 

కొవిడ్‌ రెండో ఉధృతి నేపథ్యంలో మరో రుణ పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ) నిర్ణయించాయి. రూ.25 కోట్ల లోపు ఉండే వ్యక్తిగత, చిన్న వ్యాపార సంస్థలు, ఎంఎ్‌సఎంఈ రుణాలు అన్నిటికి ఈ పునర్‌  వ్యవస్థీకరణ వర్తిస్తుంది. ఇందుకోసం పీఎ్‌సబీలు నిర్ణీత విధానం అనుసరిస్తాయని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌ ఖారా చెప్పారు. ఈ విధానం ఈ నెల 5న ఆర్‌బీఐ ప్రకటించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉంటుందన్నారు. అయితే ఎంత మంది  రుణ పునర్‌ వ్యవస్థీకరణ ఉపయోగించుకుంటారనే విషయం ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు. గత ఏడాది ప్రకటించిన రుణ పునర్‌ వ్యవస్థీకరణ పథకాన్ని ఎంఎ్‌సఎంఈలు పెద్దగా ఉపయోగించుకోని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇందుకు అర్హులైన రుణ ఖాతాదారులకు తమ బ్యాంక్‌ ఇప్పటికే సంక్షిప్త సందేశాలు పంపించినట్టు తెలిపారు.

Updated Date - 2021-05-31T06:38:05+05:30 IST