టోక్యోలో ఎమర్జెన్సీ ఎత్తివేత

ABN , First Publish Date - 2021-06-18T09:20:43+05:30 IST

మరో నెలరోజుల్లో ఒలింపిక్స్‌ మొదలవనున్న నేపథ్యంలో మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనున్న టోక్యో నగరంలో అత్యవసర స్థితి (ఎమర్జెన్సీ)కి ముగింపు పలకాలని జపాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

టోక్యోలో ఎమర్జెన్సీ ఎత్తివేత

టోక్యో: మరో నెలరోజుల్లో ఒలింపిక్స్‌ మొదలవనున్న నేపథ్యంలో మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనున్న టోక్యో నగరంలో అత్యవసర స్థితి (ఎమర్జెన్సీ)కి ముగింపు పలకాలని జపాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 20వ తేదీతో ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్టు ఆ దేశ ప్రధాని యొషిహిడె సుగా ప్రకటించారు. జపాన్‌లో కరోనా వైరస్‌ విజృంభణ దృష్ట్యా ఏప్రిల్‌ నెలాఖరు నుంచి టోక్యోతో పాటు మరో మూడు నగరాల్లో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. టోక్యో విశ్వక్రీడలు వచ్చేనెల 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. 

Updated Date - 2021-06-18T09:20:43+05:30 IST