Emergency వైద్యానికి మరో పథకం

ABN , First Publish Date - 2021-12-08T16:39:51+05:30 IST

ప్రజావైద్యం కోసం ఇప్పటికే వివిధ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. రోడ్డుప్రమాదాల్లో అత్యవసర వైద్యం కోసం కొత్తగా మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 18వ తేదీన ‘ఇన్నుయుర్‌ కాప్పోమ్‌’ పథకాన్ని

Emergency వైద్యానికి మరో పథకం

18న ‘ఇన్నుయుర్‌ కాప్పొమ్‌’ ప్రారంభం 

610 ఆస్పత్రుల్లో అమలు


చెన్నై: ప్రజావైద్యం కోసం ఇప్పటికే వివిధ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. రోడ్డుప్రమాదాల్లో అత్యవసర వైద్యం కోసం కొత్తగా మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 18వ తేదీన ‘ఇన్నుయుర్‌ కాప్పోమ్‌’ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. రోడ్డు ప్రమాదాల మరణాలను నివారించడానికి ఈ పథకం విశేషంగా ఉపయోగపడుతుందని ప్రభు త్వం గట్టిగా భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 610 ఆస్పత్రుల్లో ఈ పథకాన్ని ఈ నెల 18న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించనున్నారు. ఈ పథకం ప్రారంభోత్సవ సభ మేల్‌మరువత్తూరులోని వైద్యకళాశాల మైదా నంలో జరుగనుంది. దాని ఏర్పాట్లను ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్ర మణ్యం మంగళవారం ఉదయం పరిశీలించారు. అక్కడి ఆదిపరాశక్తిపీఠం ఆధ్యాత్మిక గురువు బంగారు అడిగళార్‌ను కలుసుకుని ఆశీస్సులందుకు న్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో రోడ్డుప్రమాదాల్లో మృతుల సంఖ్య అధికం కావడానికి కారణం వారికి సకాలంలో అత్యవసర వైద్యం అందక పోవడమేనని చెప్పారు. 


ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే రోడ్డుప్రమాద బాధితులకు అత్యవసర వైద్యసదుపాయం అందించడానికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‘ఇన్నుయుర్‌ కాప్పోమ్‌ - నమ్మై కాక్కుమ్‌ 48’ పథకాన్ని ప్రారం భించనున్నారని తెలి పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని 48 గంటల్లోగా ఆస్పత్రుల్లో చేర్పించటమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదా ల్లో గాయపడినవారిని ప్రజలు చూసీచూడనట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోతుండటం బాధాకరమన్నారు. ఈ పరిస్థితుల్లోోనే ప్రమాదాల్లో గాయపడినవారిని ఆస్పత్రుల్లో చేర్చేవారికి ప్రభుత్వం రూ.5వేలు బహుమానంగా ఇవ్వనుందని చెప్పారు. ‘ఇన్నుయుర్‌ కాప్పోమ్‌’ పథకం కింద చికిత్స అందించేందుకు 610 ఆస్పత్రులను ఎంపిక చేశామని, వీటిలో 205 ప్రభుత్వ, 405 ప్రైవేటు ఆస్పత్రులున్నాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారు ఏ దేశానికి చెందినవారైనా, ఏ రాష్ట్రానికి చెందినవారైనా ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఈ ఆస్పత్రుల్లో తక్షణ చికిత్స అందిస్తారని, వైద్యానికి అయ్యే వ్యయంలో లక్ష రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు. ఈ కొత్త పథకం అమలులోకి వస్తే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా మృతుల సంఖ్య బాగా తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Updated Date - 2021-12-08T16:39:51+05:30 IST