నగరంలో మొదటి ఈఎంఎఫ్‌ క్లబ్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2021-04-16T06:56:16+05:30 IST

ఎకనామిక్స్‌, మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌ రంగాల్లోని విద్యార్థులను ప్రోత్సహించేందుకు విద్యార్థుల నేతృత్వంలో నిర్వహించే ఈఎంఎ్‌ఫ క్లబ్‌ను ఆన్‌లైన్‌ వేదికగా ప్రారంభించారు.

నగరంలో మొదటి ఈఎంఎఫ్‌ క్లబ్‌ ఏర్పాటు

ఐఎ్‌సబీఎఫ్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, గీతాంజలి స్కూల్‌ భాగస్వామ్యంతో..

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఎకనామిక్స్‌, మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌ రంగాల్లోని విద్యార్థులను ప్రోత్సహించేందుకు విద్యార్థుల నేతృత్వంలో నిర్వహించే ఈఎంఎ్‌ఫ క్లబ్‌ను ఆన్‌లైన్‌ వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎ్‌సబీఎఫ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ చిరాగ్‌ మెహతా మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే రంగాల్లో ఇది ఒకటని తెలిపారు. ఎకనామిక్స్‌, మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌ అనేవి ఒకదానితో ఒకటి అనుసంధానమైన విభాగాలని, వీటిపై అవగాహన విద్యార్థుల భవిష్యత్‌ను మెరుగుపరుస్తుందన్నారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ అండ్‌ ఫైనాన్స్‌(ఐఎ్‌సబీఎఫ్‌), లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ కలిసి ఈఎం్‌ఫ క్లబ్‌ను ఏర్పాటు చేశాయి. గతంలోనే ముంబై, చెన్నైల్లో శాఖలను ఏర్పాటుచేశారు. నగరంలో గీతాంజలి సీనియర్‌ స్కూల్‌ భాగస్వామ్యంతో దేశంలో మూడవ ఈఎంఎ్‌ఫ క్లబ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. గీతాంజలి స్కూల్‌ 12వ గ్రేడ్‌కు చెందిన 200 మంది విద్యార్థుల ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించారు. 


Updated Date - 2021-04-16T06:56:16+05:30 IST