ఎల్‌ఐసీ... హౌసింగ్ గృహవరిష్ట ఈఎంఐల మాఫీ..

ABN , First Publish Date - 2021-03-26T22:04:40+05:30 IST

ఎల్‌ఐసీ... హౌసింగ్ గృహవరిష్ట ఈఎంఐల మాఫీ..

ఎల్‌ఐసీ... హౌసింగ్ గృహవరిష్ట ఈఎంఐల మాఫీ..

ముంబై : ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇంటి కొనుగోలుదారులకు ఓ ఆఫర్‌నిస్తోంది. ఈ మేరకు ‘గృహవరిష్ట’ పేరుతో హౌసింగ్ లోన్ ప్లాన్‌ని అందుబాటులోకి తీసుకొవచ్చింది. కాగా... ఇప్పుడు ఆరు ఈఎంఐల మాఫీ సదుపాయంతో గృహవరిష్ట మార్టగేజ్ గృహరుణాన్ని కొత్తగా తీసుకు వచ్చింది. డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ స్కీమ్ పరిధిలోని ఉద్యోగులు, పెన్షనర్ల కోసం దీనిని రూపొందించింది.


హోమ్ లోన్ చెల్లింపులు జరుగుతున్న కాలంలో 37, 38, 73, 74, 121, 122 ఈఎంఐలను మాఫీ చేసి అప్పటికి రుణగ్రహీత చెల్లించాల్సిన ‘అసలు’లో సర్దుబాటు చేస్తారు. ఇక... 65 సంవత్సరాల లోపు వారు ఇందుకు అర్హులు. ప్రత్యేక లక్షణాల కారణంగా గృహవరిష్టను జూలై 2020 లో ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి కంపెనీ రూ. 15-రూ.30వేల కోట్లు పంపిణీ చేసిందని సీఈవో తెలిపారు. ఇప్పుడు ఆరు ఈఎంఐల మినహాయింపు... వినియోగదారుడికి లాయాల్టీ ప్రయోజనాన్ని కలిగిస్తుందన్నారు. 


 

Updated Date - 2021-03-26T22:04:40+05:30 IST